Nagababu About Chiranjeevi: మెగాస్టార్ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇండస్ట్రీలో సుధీర్ఘ కాలం కలిసి ఉన్న కుటుంబాల గురించి లెక్కిస్తే మొదట చెప్పుకునే పేరు కొణిదెల ఫ్యామిలీ.అదేనండి మెగాస్టార్ ఫ్యామిలీ. చిరంజీవి టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సమయంలో నాగబాబు, పవన్ కల్యాణ్ చిన్న వారు. అన్న వెంటనే తమ్ముళ్లు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకానొక సందర్బంలో పవన్ కళ్యాణ్ గురించి ఆవేదన చెంది తన ఫ్యూచర్ గురించి ఆలోచించి చిరునే ఇండస్ట్రీలోకి తీసుకొని వచ్చారట.
శివ శంకర వరప్రసాద్ కాస్త మెగాస్టార్ చిరంజీవిగా మారిపోవడం.. అన్న వెంటనే తమ్ముళ్లు నడవడంతో వీరి ఫ్యామిలీ గురించి ఎప్పుడు కొనియాడేవారు ఇతరులు. అన్న నీడనే ఉంటూ ఇద్దరు కూడా మంచి పేరు సంపాదించారు. పెళ్లి తర్వాత ఎవరి ఫ్యామిలితో వారు బిజీ అయినా కూడా పండుగలు, ఫంక్షన్ లకు మాత్రం అంతా ఒకే చోట చేరి సందడి చేస్తుంటారు ఈ కొణిదెల కుటుంబం.
ఇటీవల నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ నిశ్చితార్థం కూడా గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ వేడుకకు కొణిదెల ఫ్యామిలీ మొత్తం హాజరైంది. త్వరలోనే వీరి వివాహం ఉండడంతో అందరూ బిజీ అయిపోయారు. ఇలా వేరు వేరుగా ఉంటున్నా కూడా కలిసి ఉన్నట్టుగానే కనిపించే ఈ ఫ్యామిలీకి అభిమానులు ఎక్కువే…అయితే పెళ్లి వేడుకలకు సంబంధించి కొన్ని ఫొటోలను ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన ఇన్ స్టా ద్వారా షేర్ చేసిన సంగతి తెలిసిందే. వరుణ్ బాబు వివాహ మహోత్సవం భారీగా నిర్వహిస్తామని తెలిపారు చిరు. ఇక, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం అన్న మద్దతు ఎవరికి అంటూ ప్రశ్నలు లేవనెత్తగా.. తప్పకుండా తమ్ముడికే అంటూ చిరంజీవి చెప్పారు. ఇలా సాదక బాధకాల్లో అందరూ కలిసే ఉంటారు.
నాగబాబు ఇటీవల ఒక ఇంటర్వూలో చిరంజీవి భార్య, తన వదిన సురేఖ గురించి కొన్ని విషయాలు చెప్పారు. ‘వదిన నాకు, పవన్ బాబుకు ఎప్పటికీ తల్లి లాగే ఉంటుంది. ఎంత ఉమ్మడి కుటుంబం అయినా అప్పుడప్పుడు గొడవలు కామనే కదా.. చాలా వరకు అన్నయ్య మాట అందరం వింటుంటాం.. కానీ అన్నయ్యకు నాకు మధ్య ఏదైనా వివాదం వస్తే మాత్రం వదిన ఎంటర్ అవుతుంది. నా వైపే మాట్లాడుతుంది. ఒక్క మాట కూడా అననివ్వదు.అంతే కాదు అప్పుడప్పుడు కళ్యాణ్ బాబును కూడా సమర్థిస్తుంది. అందుకే వదిన అంటే మా ఇద్దరికీ గౌరవం. కళ్యాణ్ బాబు కంటే నేను ఎక్కువగా జోకులు వేస్తూ ఉంటాను కాబట్టి నన్ను ఎక్కువగా మెచ్చుకుంటుంది’ అని వదిన గురించి కొనియాడారు నాగబాబు.