Israel Hamas Conflict: చిన్న గాయం తగిలితేనే విలవిలలాడిపోతాం. ఒంటిపై రక్తం కనిపిస్తే భయకంపితలమైపోతాం. కానీ ఎక్కడ ఎటు చూసినా శవాల దిబ్బలే. రక్తపుటేరులే.. ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది శవాలుగా పడి ఉన్నారు. తూటాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆయుధాలు, ధ్వంసమైన వాహనాలతో అక్కడి వాతావరణం అత్యంత భీతావహంగా ఉంది. ఇంతటి ఉత్పతానికి కారణం హమాస్ ఉగ్రవాదులు. మానవత్వం వారిలో మచ్చుకైనా లేదు. పైగా ఎదుటివారిని చంపుతూ వారు పొందుతున్న రాక్షసానందం అంతా ఇంతా కాదు.
ఇజ్రాయిల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య వైరం ఈనాటిది కాదు. కానీ కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయిల్ హమాస్ ఉగ్రవాదులపై ఉగ్రవాదులపై పై చేయి సాధిస్తూ వస్తూంది. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ హమాస్ ఉగ్రవాదులు కోలుకోలేని దెబ్బతీశారు. ఇందుకు గత శనివారం ఇజ్రాయిల్ దేశంలో జరిగిన ఒక మ్యూజిక్ పార్టీని హమాస్ ఉగ్రవాదులు ఉగ్రవాదులు తమ నరమేధానికి వేదికగా చేసుకున్నారు. గత శనివారం గాజా లోని కిబ్బుజ్ రీమ్ వద్ద నోవా పేరుతో ఇజ్రాయిలీలు ఒక పార్టీ నిర్వహించారు. జనం ఆ కార్యక్రమానికి 3000 మంది దాకా హాజరయ్యారు. పలు వ్యాన్లలో 50 మంది సాయుధ ముష్కరులు అక్కడికి వచ్చారు. డీజే సౌండ్ వినిపిస్తుండగా.. రాకెట్లు దూసుకు వచ్చాయి. హమాస్ ఉగ్రవాదులు కూడా తూటాల వర్షం కురిపించారు. భయకంపితులైన యువతీ యువకులు రోడ్లమీదకి పరుగులు తీశారు. దొరికిన వారిని దొరికినట్టే ముష్కరులు చంపేశారు. అందరు చూస్తుండగానే యువతుల పై రేప్ లు చేశారు. మహిళలను ఎత్తుకు వెళ్లారు. కొందరిని అత్యంత క్రూరంగా చంపి వాటిని వీడియో రూపంలో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇంతటి నరమేధం లో ఆల్ఫర్ చూపించిన తెగింపు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నోవా సంగీత సంబరంలో అక్కడ చెత్తను ఏరి వేయడం, అక్కడికి వచ్చిన స్థానికులకు మద్యం సరఫరా చేయడం ఆమె విధి. ముష్కరులు ఒక్కసారిగా రాకెట్ల వర్షం కురిపించడంతో ఆమె భయపడి తన కారుతో బయటికి వెళ్ళింది. అప్పటికే రోడ్డు మీద చాలామంది జనం భూమి గుడి ఉన్నారు. అయితే ఆమె తన కారులో కొంతమందిని ఎక్కించుకుంది. ముష్కరులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరపడంతో ఆమె పక్కన కూర్చున్న వారు కన్నుమూశారు. ఒక బుల్లెట్ అయితే ఆమె చెవి పక్కనుంచే దూసుకుని వెళ్ళింది. బయటకు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో ఆమె కారులో నుంచి రోడ్డు పక్కన ఉన్న దట్టంగా ఉన్నప్పుడు దూకేసింది.. ఈ దూకే క్రమంలో ఆమె చేతులు తీవ్రంగా గాయపడ్డాయి. అంతటి బాధను కూడా ఆమె పంటి బిగువన భరించారు. సుమారు 6 గంటల పాటు ఇజ్రాయిల్ సైన్యం కోసం ఆమె ఎదురు చూశారు. చివరికి సైన్యం రావడంతో ఆమె సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. ఇక ఇదే పార్టీకి ఏస్తేర్ బ్రోవోచ్ అనే మహిళ కూడా హాజరైంది. ఆమె కూడా తన ప్రాణాలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. తనకు కారులో ఆశ్రయించిన వ్యక్తి ఆమె చూస్తుండగానే కుప్పకూలిపోయాడు.. ఆమె కళ్ళ ముందు కొంతమంది విదేశీయులను ముష్కరులు అపహరించుకుని వెళ్లిపోయారు. అయితే తనను ముష్కరులు చంపేస్తారేమోనని భయంతో ఎస్తేర్ చనిపోయినట్టు నటించింది. అలా నటించి తన ప్రాణాలను కాపాడుకుంది.