Yuganiki Okkadu: సూర్య(Suriya Sivakumar) తమ్ముడిగా కార్తీ(Karthi Sivakumar) వెండితెర అరంగేట్రం చేసిన చిత్రం ‘ఆయిరత్తిల్ ఒరువన్’. తెలుగు లో ఈ సినిమాని ‘యుగానికి ఒక్కడు'(Yuganiki Okkadu) పేరుతో రిలీజ్ చేసారు. అప్పట్లో తమిళంలో యావరేజ్ గా ఆడిన ఈ సినిమా, తెలుగు లో మాత్రం సూపర్ హిట్ గా నిల్చింది. కార్తీ ఈ సినిమాతోనే మన తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అప్పట్లో ఈ చిత్రాన్ని దాదాపుగా 18 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించారు. ఆరోజుల్లో 18 కోట్ల రూపాయిల బడ్జెట్ అంటే, ఇప్పటి మార్కెట్ తో పోల్చి చూస్తే 100 కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. తెలుగు లో ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’, ‘7/G బృందావన కాలనీ’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ కి దర్శకత్వం వహించిన సెల్వ రాఘవన్(Selva Raghavan) ఈ చిత్రానికి దర్శకుడు. భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా అంటూ అప్పట్లో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ విడుదల చేసారు.
సౌత్ లో ఆరోజుల్లో ‘మగధీర’ తర్వాత అంతటి భారీ బడ్జెట్ ఈ సినిమాకే ఖర్చు చేసారు. అలా మూవీ టీం ప్రచారం చేయడంతో ఆకాశాన్ని అంటిన అంచనాలతో ఈ చిత్రం విడుదలైంది. అందుకే ఆ అంచనాలను అందుకోవడం లో తమిళనాట విఫలం అయ్యింది. కానీ తెలుగు లో మాత్రం దుమ్ము లేపేసింది. మొదటి సినిమాతోనే కార్తీ అద్భుతమైన నటన కనబర్చాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా రీమా సేన్, ఆండ్రియా జరేమియా(Andrea Jeremiah) నటించారు. ఈ చిత్రాన్ని త్వరలోనే రీ రిలీజ్ చేయబోతున్నట్టు ఆ చిత్ర నిర్మాతలు అధికారిక ప్రకటన చేసారు. నేటి తరం ఆడియన్స్ లో ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్ ‘రేయ్..ఎవర్రా మీరంతా’ బాగా పాపులర్ అయ్యింది. ఈ డైలాగ్ తో వేల మీమ్స్ వచ్చాయి.ఇప్పటికీ ఆ మీమ్స్ ట్రెండింగ్ లోనే ఉన్నాయి.
యూత్ ఆడియన్స్ అలా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి, రీ రిలీజ్ లో సెన్సేషన్ సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. భారీగా రిలీజ్ ఇస్తే కచ్చితంగా ఈ చిత్రం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు రీ రిలీజ్ రికార్డ్స్ ని బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం రీ రిలీజ్ చిత్రాలలో అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాలు వాళ్ళవే కాబట్టి. ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా ప్రకటించాడు డైరెక్టర్ సెల్వ రాఘవన్. అయితే ఈ సీక్వెల్ లో కార్తీ హీరో గా నటించడం లేదు. ధనుష్(Hero Dhanush) హీరో గా నటించబోతున్నాడట. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ధనుష్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి, త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకి దాదాపుగా 150 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేయబోతున్నారట.