Renu Desai: ఒక టాప్ స్టార్ మాజీ భార్యగా రేణూ దేశాయ్ ఏం మాట్లాడినా సంచలనమే. పవన్ కళ్యాణ్ తో రేణూ దేశాయ్ విడిపోయి చాలా కాలం అవుతుంది. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే ఆమె చేసే కామెంట్స్ వివాదాస్పదం అవుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ కి చేయాల్సిన న్యాయం చేసినా, చట్టబద్ధంగా విడిపోయినా ఆయన్ని టార్గెట్ చేస్తుందని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తారు. పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఆమె చేసే కామెంట్స్ వెనుక ఎవరో ఉన్నారని అభిమానుల ప్రధాన ఆరోపణ.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో ఆమెకు సోషల్ మీడియా వార్ నడుస్తుంది. అయితే మొదటిసారి రేణూ దేశాయ్ మాజీ భర్త పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నా విషయంలో తప్పు చేశారేమో కానీ ఆయన సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. డబ్బు వ్యామోహం పవన్ కళ్యాణ్ కి లేదని ఓ వీడియో విడుదల చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేణూ దేశాయ్ ని టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఎవరో డబ్బులిస్తే రేణూ దేశాయ్ ఇలా చేసిందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ ట్రోలింగ్ పై రేణూ దేశాయ్ స్పందించారు. గతంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఫ్యాన్స్ వేధించారు. ఇప్పుడు ఆయనకు మద్దతుగా మాట్లాడితే యాంటీ ఫ్యాన్స్ దూషిస్తున్నారు.
అప్పుడు ఇప్పుడు నేను నిజమే చెబుతున్నాను. ప్రేమించినందుకు నిజం మాట్లాడినందుకు నేను మూల్యం చెల్లిస్తున్నాను. నాకు ఇలా జరగాలని రాసి ఉంటే జరగనీయండి. నన్ను తిట్టడం స్టార్ట్ చేయండి అని ఓ సుదీర్ఘ సందేశం రేణూ దేశాయ్ రాసుకొచ్చింది. విడాకుల విషయంలో పవన్ గురించి భార్యగా మాట్లాడాను. ఇప్పుడు ఒక సిటిజెన్ గా మాట్లాడాను. రెండు సందర్భాల్లో నేను వేధింపులకు గురయ్యానని రేణు దేశాయ్ ఆవేదన చెందారు.