Homeప్రత్యేకంFoxconn Telangana: ఫోక్స్ కాన్ ఈవీ ప్రాజెక్ట్: రేసులోకి తెలంగాణ.. ఈవీల్లో నంబర్ 1 కోసం...

Foxconn Telangana: ఫోక్స్ కాన్ ఈవీ ప్రాజెక్ట్: రేసులోకి తెలంగాణ.. ఈవీల్లో నంబర్ 1 కోసం ప్లాన్లు

Foxconn Telangana: 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ప్రగతి రథంలో ముందుకు పరిగెడుతుంది. అన్ని రంగాలలో ముందడుగు వేయడానికి ప్రయత్నం చేయడమే కాకుండా అంతర్జాతీయ ప్రాజెక్ట్లను కైవసం చేసుకునే రేసులో కూడా ముందంజలో ఉంది. రీసెంట్ గా ఫాక్స్కాన్ నుండి ఆపిల్ ఎయిర్పెడు మరియు ఇతర ఉపకరణాలను తయారు చేయడం కోసం $ 550 మిలియన్ల విలువ చేసే ప్రాజెక్ట్ తెలంగాణకే దక్కింది.

ఇప్పుడు ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ కోసం జరిగే రేసులో కూడా తెలంగాణ పాల్గొంటుంది. ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ గా ప్రసిద్ధి చెందిన హాన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ మరియు సోర్సింగ్ లో భారత్ ను మూడవ అతిపెద్ద గ్లోబల్ హబ్ గా మార్చాలి అన్న తన ఉద్దేశాన్ని ప్రకటించింది. ఇటువంటి కంపెనీల కారణంగా మన దేశ యువతకు ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా లభిస్తాయి.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణతో పాటు తమిళనాడు, గుజరాత్, కర్ణాటక కూడా సముకత చూపుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ఫాక్స్కాన్ తో మాట్లాడబోతున్నట్లు తెలంగాణ ఇండస్ట్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పేర్కోన్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల అడ్డాగా తెలంగాణ మారుతున్న విషయం అందరికీ తెలిసిందే. కొత్త రకమైనటువంటి ఉపాధి అవకాశాలు ఎక్కడ ఉన్నా సరే వాటిని వెతికి పట్టుకోవడంలో కేటీఆర్ ఆరి తేరిపోయారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రోగ్రెస్ చూసి అయినా ఆంధ్ర రాష్ట్ర పాలకులు ఎంతో కొంత నేర్చుకోవాలని అందరూ అభిప్రాయపడుతున్నారు. అటు ఐటీ లోనే కాకుండా ఎటు మ్యానుఫ్యాక్చరింగ్ వైపు కూడా తెలంగాణ ముందు అడుగు వేస్తూ ఉంటే మనం మాత్రం పానీపూరి బండి దగ్గరే ఆగిపోయి ఉన్నాము. ఆంధ్రప్రదేశ్, కొత్త పరిశ్రమలు అనేవి రెండు భిన్న ధృవాల లాంటివి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
Exit mobile version