Sr NTR And Jr NTR: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కామెంట్స్, సోషల్ మీడియా పోస్ట్స్ ఒకింత ఆసక్తిరేపుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వివాదాలకు దారి తీస్తూ ఉంటాయి. తాజాగా బండ్ల గణేష్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఆయన మూడు ఫోటోలు పొందుపరిచారు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ రెండో కొడుకు భార్గవ్ రామ్ ఫోటో కలిపి పోస్ట్ చేశాడు. నేడు భార్గవ్ రామ్ పుట్టినరోజు. 2018 జూన్ 14న భార్గవ్ రామ్ జన్మించాడు.

ఇక స్టార్ కిడ్స్ కి ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భార్గవ్ రామ్ మొదటి బర్త్ డే నుండే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. నేడు భార్గవ్ రామ్ నాలుగో వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు భార్గవ్ రామ్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. బండ్ల గణేష్ తన ట్వీట్ లో సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ ల ఫొటోలతో పాటు భార్గవ్ రామ్ ఫోటో పోస్ట్ చేశారు.

Also Read: Venomous Snakes: రాష్ట్రంలో విషపూరితమైన పాములు ఆ నాలుగే..వెరీ డేంజరెస్ అంటున్న నిపుణులు
ఈ నేపథ్యంలో ఈ పోస్ట్ ద్వారా బండ్ల గణేష్ ఏం చెప్పాలనుకుంటున్నారనే క్యూరియాసిటీ అందరిలో మొదలైంది. ఓ కోణంలో చూస్తే… తాత ఎన్టీఆర్ వారసత్వం జూనియర్ ఎన్టీఆర్ నిలబెట్టగా, జూనియర్ ఎన్టీఆర్ లెగసీ భార్గవ్ రామ్ ముందుకు తీసుకెళ్తాడని అనిపిస్తుంది. లేదంటే ఎన్టీఆర్ పోలికలు జూనియర్ ఎన్టీఆర్ తర్వాత భార్గవ్ రామ్ కి వచ్ఛాయనే అర్థం కూడా కావచ్చు. ఎటువంటి కామెంట్ లేకుండా, కనీసం బర్త్ డే విషెస్ కూడా చెప్పకుండా బండ్ల గణేష్ ఆ మూడు ఫోటోలు పోస్ట్ చేయడం చర్చకు దారితీసింది.
ఇక పరిశ్రమలో బండ్ల గణేష్ కి అత్యంత సన్నిహితుల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఎన్టీఆర్ హీరోగా బండ్ల గణేష్ టెంపర్ మూవీ నిర్మించి హిట్ కొట్టారు. దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న ఎన్టీఆర్ కి బ్రేక్ ఇచ్చిన చిత్రం టెంపర్ కావడం విశేషం. అలాగే వీరి కాంబినేషన్ లో బాద్ షా తెరకెక్కింది. టెంపర్ కంటే ముందు 2013లో బాద్ షా చిత్రం చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది.
Also Read: Basara IIIT: బాసర ఐఐఐటీలో దారుణ పరిస్థితులు.. విద్యార్థుల సమ్మె
— BANDLA GANESH. (@ganeshbandla) June 14, 2022