https://oktelugu.com/

Director Krish : రహస్యంగా జరిగిన డైరెక్టర్ క్రిష్ రెండవ పెళ్లి..ఇండస్ట్రీ నుండి హాజరైంది కేవలం వీళ్ళు మాత్రమే!

హైదరాబాద్ లో ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రీతీ ని ప్రేమించి, ఆమెతో కొంతకాలం వరకు డేటింగ్ చేసిన క్రిష్ నేడు వివాహం చేసుకున్నాడు. మీడియా కి దూరంగా, కేవలం బంధు మిత్రుల సమక్ష్యంలో వీళ్లిద్దరి పెళ్లి జరిగింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 11, 2024 / 07:20 PM IST

    Director Krish Second Marraige

    Follow us on

    Director Krish : ప్రముఖ దర్శకుడు క్రిష్ నేడు హైదరాబాద్ లో ప్రీతీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. క్రిష్ కి ఇది రెండవ పెళ్లి. 2016 వ సంవత్సరం లో ఆయన రమ్య అనే డాక్టర్ ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి దాంపత్య జీవితం లో ఏర్పడిన కొన్ని అనుకోని విభేదాల కారణంగా 2018వ సంవత్సరంలో విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రీతీ ని ప్రేమించి, ఆమెతో కొంతకాలం వరకు డేటింగ్ చేసిన క్రిష్ నేడు వివాహం చేసుకున్నాడు. మీడియా కి దూరంగా, కేవలం బంధు మిత్రుల సమక్ష్యంలో వీళ్లిద్దరి పెళ్లి జరిగింది. సినీ ఇండస్ట్రీ నుండి క్రిష్ కి అత్యంత ఆప్తులైన అల్లరి నరేష్, కీరవాణి వంటి వారు మాత్రమే హాజరయ్యారట. ఈ నెల 16 వ తేదీన ఆయన హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ చేసుకోనున్నాడు. ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళు మొత్తం హాజరు కాబోతున్నారట.

    వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా క్రిష్ కి అభిమానుల నుండి శుభాకాంక్షలు వెలువడుతున్నాయి. ప్రీతీ చూసేందుకు చాలా చక్కగా ఉందని, మేడ్ ఫర్ ఈచ్ అథర్ లాగా ఉన్నారని, మొదటిసారి విడాకులు జరిగినట్టు, రెండవసారి జరగకుండా జాగ్రత్తగా ఉండమని, చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా సర్దుకుపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే డైరెక్టర్ క్రిష్ చేతిలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’, అనుష్క ‘ఘాటీ’ చిత్రాలున్నాయి. ‘హరి హర వీరమల్లు’ కి 90 శాతం షూటింగ్ ని పూర్తి చేసిన క్రిష్, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా ఉంటూ, షూటింగ్ కి డేట్స్ ఇవ్వకపోవడంతో ఆ చిత్రం నుండి తప్పుకొని, అనుష్క ‘ఘాటీ’ కి షిఫ్ట్ అయ్యాడు.

    రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో విడుదల అవ్వగా, దానికి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. అనుష్క ని ఇంత క్రూరంగా చూపించాలనే ఆలోచన క్రిష్ కి వచ్చినందుకు ఆడియన్స్ ఆయనకీ దండం పెడుతున్నారు. ‘గమ్యం’, ‘వేదం’ లాంటి సున్నితమైన సినిమాలను తీసిన క్రిష్ లో ఇంత క్రూరత్వ ఆలోచనలు ఉన్నాయా..?, అసలు పాన్ ఇండియా లెవెల్ లో రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ వంగ లాంటి డైరెక్టర్స్ కి కూడా చంపడంలో ఇలాంటి కొత్త పద్ధతులు తెలియవు కదా అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజెన్స్. శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఆయన దర్శకత్వం వహించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం మార్చి 28 న విడుదల కాబోతుంది. ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతల నుండి ఆయన తప్పుకున్నప్పటికీ కూడా, ఆయన పర్యవేక్షణలోనే షూటింగ్ జరుగుతుందని సమాచారం.