S V Krishna Reddy: పెద్ద సినిమాలు ప్లాప్ అవ్వడానికి హీరోలే కారణం అంటున్న సీనియర్ డైరెక్టర్…

సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ వాళ్లు అంతటి స్టార్ స్టేటస్ ని అనుభవించడానికి కారణం అయిన సినిమాలను తీసిన దర్శకులను మాత్రం పెద్దగా ఎవ్వరు పట్టించుకోరు...

Written By: Gopi, Updated On : October 17, 2024 10:04 am

S V Krishna Reddy

Follow us on

S V Krishna Reddy: సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు దర్శకులు వాళ్ళకున్న ప్రతిభను చూపిస్తూ స్టార్ డైరెక్టర్స్ గా ఎదుగుతూ వచ్చారు. ముఖ్యంగా వాళ్ళు చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసి పెట్టాయనే చెప్పాలి. ఇక సీనియర్ డైరెక్టర్స్ తమను తాము గా మార్చుకోవడానికి చాలా వరకు కష్టపడుతూ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలను కూడా సక్సెస్ ఫుల్ హీరోలుగా మార్చారు. ముఖ్యంగా ఎస్ వి కృష్ణారెడ్డి లాంటి దర్శకుడు చిన్న హీరోలతో సినిమాలు చేసి పెద్ద సక్సెస్ లను అందుకున్నాడు. అలాంటి దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఇప్పటికి ఆయన చేసిన సినిమాలు చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఫ్రెష్ ఫీల్ ని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా జెన్యూన్ కామెడీని అందించడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక ఏది ఏమైనా కూడా ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి దర్శకుడితో సినిమాలు చేసిన శ్రీకాంత్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ లాంటి నటులు మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఎస్ వి కృష్ణారెడ్డి ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలేవి సక్సెస్ లను సాధించకపోవడంతో ఆయన కొద్ది వరకు వెనుకబడిపోయాడనే చెప్పాలి.

మరి ఇప్పుడు మరొక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్ హీరోల పైన సంచలన కామెంట్స్ అయితే చేశాడు. ముఖ్యంగా ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే ఒక పెద్ద సినిమా ఫ్లాప్ అవ్వడం వెనక దర్శకుడు మాత్రమే కాకుండా హీరోలు కూడా కారణమవుతాడరని ఆయన చెప్పిన మాటలు చాలామంది స్టార్ హీరోల అభిమానులను అవక్కయ్యేలా చేసింది. నిజానికి ఆయన చెప్పిన మాటల్లో కొంతవరకు నిజం ఉందా అని సినీ పెద్దలు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఇంతకీ ఆయన ఏం చెప్పాడంటే ఒక సినిమా స్టోరీని మనం రాసుకొని వెళ్తే స్టార్ హీరోలు వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఆడ్ చేస్తూ చాలా వరకు స్టోరీ లో వేలు పెడుతూ ఉంటారు. అందువల్లే కథ ఎటు కాకుండా పోతుందని తద్వారా సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయని చెప్పడం విశేషం… ముఖ్యంగా ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించినప్పటికి ఆయన పెద్ద హీరోలతో చేసిన సినిమాలేవి కూడా సక్సెస్ సాధించలేదు.

దానికి కూడా కారణం అదే అని ఆయన చెప్పకనే చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన బాలకృష్ణ, నాగార్జున తో సినిమాలు చేశాడు. మరి ఈ హీరోలు కూడా ఇలాగే ఆయన కథల్లో వేలు పెట్టారా అంటూ మరి కొంతమంది సినీ విమర్శకులు సైతం ఎస్ వి కృష్ణారెడ్డి చేసిన కామెంట్ల మీద స్పందిస్తున్నారు…