Viral Video: ముక్క తింటే అడవిపులికైనా తప్పని బొక్క తిప్పలు.. నోట్లో ఇరికి నరకం.. వీడియో వైరల్..

సాధారణంగా పులుల వంటి ప్రమాదకరమైన జంతువులు తమ కంటే పెద్ద జంతువులను వేటాడే ముందు ఆలోచించవు. వాటి ఆకలిని తీర్చుకోవడానికి తమ శక్తినంతా ఉపయోగించి ప్రతి చిన్న, పెద్ద జంతువుపైకి దూసుకుపోతాయి.

Written By: Mahi, Updated On : October 17, 2024 9:58 am

Viral Video

Follow us on

Viral Video : సాధారణంగా మనం ఎప్పుడైనా మాంసాహారం తిన్నతరువాత పళ్లలో చిన్న ముక్కలు ఇరుక్కుని ఇబ్బందులు ఎదురవుతాయి. చికెన్ లేదా మటన్‌ కూరలను లొట్టలేసుకుంటూ తిన్నంత సేపు బాగానే ఉంటుంది కానీ.. మాంసపు ముక్కలు పళ్ల సందుల్లో ఇరుక్క పోయినపుడు ఇబ్బంది ఉంటుంది. మామూలుగా వాటిని తొలగించేందుకు టూత్‌ పిక్‌లు, పిన్సీసులతో చిన్నపాటి యుద్ధమే చేయాలి. ఏదీ లేకపోతే.. చివరికి నాలుకతో అయినా సరే దాన్ని లాగి పడేస్తుంటాం. అడవిలో ఒక పులికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. సాధారణంగా పులుల వంటి ప్రమాదకరమైన జంతువులు తమ కంటే పెద్ద జంతువులను వేటాడే ముందు ఆలోచించవు. వాటి ఆకలిని తీర్చుకోవడానికి తమ శక్తినంతా ఉపయోగించి ప్రతి చిన్న, పెద్ద జంతువుపైకి దూసుకుపోతాయి. అలా చేసిన క్రమంలో ఈసారి ఓ పులి చిక్కుల్లో పడింది. ఒక పెద్ద మాంసం ముక్క దాని పళ్లలో చిక్కుకుంది. దీంతో నానా కష్టాలు పడుతున్న పులిని చూసిన పశువైద్యులు దాని కోరల్లో ఇరుక్కున్న మాంసం ముక్కను లాగి పడేశారు.

ఈ మేరకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న వీడియోలో పులి పంటిలో పెద్ద ఎముక ఇరుక్కుపోయిందని చూడవచ్చు. దీన్ని తొలగించడానికి పశు వైద్యుడు జంతువును అపస్మారక స్థితికి తీసుకురావడం.. ఎముకను సుత్తితో తొలగించడం చూడవచ్చు. టైగర్ రెస్క్యూకి సంబంధించిన ఈ వీడియోపై యూజర్లు పలు రకాల రియాక్షన్లు కూడా ఇచ్చారు. డాక్టర్లు పిచ్చి పని చేస్తున్నారని కొందరంటే, పులి నోటిలో చెయ్యి పెట్టడం కూడా పెద్ద పని అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడిది అనే దానిపై స్పష్టత లేదు.

చికిత్స పొందుతున్న పులి…
కామెంట్ బాక్స్ లో పులికి వైద్యులు చేస్తున్న దంతాల చికిత్సపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దంతవైద్యులు మనుషులకు కూడా ఇలాంటి పనే చేస్తారని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మరొక నెటిజన్ ‘ ఇల్లు కట్టే సాధనంతో నా నోటి నుండి పెద్ద ఎముకను బయటకు తీశారు. ఈ షాకింగ్ పని అత్యంత నైపుణ్యం కలిగిన బృందం మాత్రమే చేయగలదని రాశాడు. టైగర్ ప్రాణాలను కాపాడిన దంతవైద్యుడిని చాలా మంది నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ వీడియోలో వెటర్నరీ వైద్యులు అపస్మారక స్థితిలో ఉన్న పులి నోటి నుండి ఎముకను తొలగిస్తున్నట్లు చూడవచ్చు. పులి దంతాల నుండి ఎముకను తొలగించే ముందు, దానిని అపస్మారక స్థితికి తీసుకురావడానికి ఇంజెక్షన్ ఇవ్వాలి. అప్పుడే వైద్యులు తమ పనిని అంత తేలిగ్గా చేయగలుగుతారు. డాక్టర్ చేతిలో సుత్తి ఉంది. దాని సహాయంతో అతను పులి దవడలో ఇరుక్కున్న పెద్ద ఎముక ముక్కను తొలగించడానికి ప్రయత్నిస్తున్నాడు.

పులి పళ్ళలో ఎముక ముక్క చాలా లోతుగా దిగింది. దానిని తొలగించడానికి ఎముకను సుత్తితో చాలాసార్లు కొట్టారు. చివరికి పులి దంతాల నుండి మొండి ఎముక ముక్క బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన 16సెకన్ల వీడియో క్లిప్ X లో @AMAZlNGNATURE అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి 22 లక్షలకు పైగా వ్యూస్, 17 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై 400లకు పైగా కామెంట్లు వచ్చాయి.