OTT : చిన్న సినిమాలకి ఊపిరి పోస్తున్న ఓటిటి…కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీ చాలామంది సక్సెస్ ఫుల్ దర్శకులుగా మారాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇక దానికి తగ్గట్టుగా వాళ్ళు మంచి కథలతో సినిమాలు చేస్తే ఈజీగా సక్సెస్ ఫుల్ దర్శకులుగా పేరు సంపాదించుకుంటారు. కానీ అలా కాకుండా రొటీన్ రెగ్యూలర్ కథలతో సినిమాలు చేస్తే మాత్రం ఇప్పుడున్న రోజుల్లో వాళ్ళు షెడ్డు కి వెళ్లి పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది...

Written By: Gopi, Updated On : October 17, 2024 10:30 am

OTT Movie

Follow us on

OTT :  సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న సినిమాల మీద సగటు ప్రేక్షకుడు ఇంట్రెస్ట్ అయితే చూపించరు. ఆ సినిమాకి సక్సెస్ టాక్ వస్తే తప్ప ఆ సినిమాను చూసే ప్రేక్షకులు కూడా ఉండరు. కాబట్టి ఇలాంటి సందర్భంలో చిన్న సినిమాల ప్రొడ్యూసర్లు భారీగా నష్టపోతున్నారు అంటూ చాలా సంవత్సరాలుగా వార్తలైతే వస్తున్నాయి. నిజానికి థియేటర్ రిలీజ్ అయిన తర్వాత వాళ్లకు సాటిలైట్ రైట్స్ రూపంలో కొంత డబ్బులు అయితే వస్తాయి. అలా వాళ్ళు నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకునే అవకాశాలైతే ఉండేవి. అయితే ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి రావడంతో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా థియేటర్లో రిలీజ్ అయిన అన్ని సినిమాలను పది రోజుల్లోపు ఓటిటి ప్లాట్ ఫామ్ మీదికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనివల్ల అన్ని సినిమాలకి సరైన రేటును నిర్ణయించి ఓటిటి వాళ్లు తమ ప్లాట్ ఫామ్ లో ఆ సినిమాని రిలీజ్ చేయాలని కొనుకుంటున్నారు.

దానివల్ల చిన్న సినిమాల ప్రొడ్యూసర్స్ కూడా చాలావరకు ప్రాఫిట్స్ లో ఉండే అవకాశాలైతే ఉన్నాయి. దీంతో ఆ ప్రొడ్యూసర్స్ మరొక సినిమా చేయడానికి ముందుకు వస్తున్నారు. నిజానికి ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కి ఓటిటి అనేది ఒక వరంలా మారిందనే చెప్పాలి. థియేట్రికల్ రైట్స్ రూపంలో అలాగే ఓటిటి రైట్స్ ద్వారా, సాటిలైట్ రైట్స్ వల్ల ప్రొడ్యూసర్స్ కి చాలా వరకు ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయనే చెప్పాలి. ఇక మొత్తానికైతే చాలా సినిమాలు రిలీజ్ అయిన 10 రోజుల్లోపే ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవ్వడం ఒక వంతుకు చాలా మంచి విషయం అనే చెప్పాలి.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే థ్రిల్లర్ సినిమాలకి ఓటిటి ప్లాట్ ఫామ్ లో చాలా ఎక్కువ ఆదరణ అయితే దక్కుతుంది. ముఖ్యంగా చాలామంది ప్రేక్షకులు థ్రిల్లర్ సినిమాలను చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ప్రతి సీన్ వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు ఆ సినిమాలను చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

సినిమా చేయడం ఇక ఫ్యాషన్ అయితే దాన్ని సక్సెస్ ఫుల్ గా మలచడం అనేది మరొక ఎత్తనే చెప్పాలి. ఇక మొత్తానికైతే కొత్తగా దర్శకులు అవుదామనుకున్న చాలామందికి ఓటిటి ప్లాట్ ఫామ్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. కొంత మంది ప్రొడ్యూసర్స్ కూడా డైరెక్ట్ గా ఓటిటి వరకే సినిమాని చేసి రిలీజ్ చేసుకొని ప్రాఫిట్స్ ను సంపాదిస్తున్నారు…