ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాఫియాతో లింకులు.. డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు.. నెపోటిజం.. లైగింక వేధింపులు వంటి అనేక చీకటి కోణాలు వెలుగుచూస్తున్నాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య తర్వాత తెరవెనుక జరుగుతున్న బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.
బాలీవుడ్లో ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు ఇటీవల ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. మీటూ ఉద్యమంలో భాగంగా బాలీవుడ్లోని నటీమణులు తమకు ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలను అందరితో పంచుకుంటున్నారు. ఈక్రమంలోనే పలువురు హీరోయిన్లు తమపై కొందరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది.
తాజాగా బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ ఓ ఇంటర్వ్యూ క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడింది. ఈసందర్భంగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని పాయల్ ఘోష్ ఆరోపించింది. ‘బాంబే వెల్ వెట్’ సినిమా కోసం తాను ఆయన వద్దకు వెళ్లినట్లు చెప్పింది. తన సినిమాలో నటించాలనుకుంటే తనకు పడకసుఖం అందించాలని.. తనతో సన్నహితంగా ఉంటే భవిష్యత్తులో మరిన్ని సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పారని.. ఇదంతా ఇండస్ట్రీలో కామన్ అన్నట్లు ఆయన చెప్పినట్లు వెల్లడించింది. ఆ సమయంలో తాను ఆయనకు ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు చెప్పడంతో తీవ్ర దుమారం రేగింది.
దీనిపై అనురాగ్ కశ్యప్ సైతం స్పందిస్తూ తాను ఎవరినీ లైంగిక వేధింపులకు గురిచేయలేదని.. ఆధారాలుంటే నిరూపించాలని సోషల్ మీడియాలో స్పందించాడు. ఇక ఇదే విషయంపై సీనియర్ నటి కస్తూరి తాజాగా స్పందించింది. పాయల్ ఘోష్ అనురాగ్ కశ్యప్ పై చేసిన లైంగిక ఆరోపణలు చట్టపరంగా నిరూపించడం అసాధ్యమని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇరువురిలో ఒకరి జీవితం నాశనం అవుతుందంటూ పేర్కొంది.
కస్తూరి ట్వీట్ పై ఓ నెటిజన్ స్పందిస్తూ మీకుగానీ.. లేదా మీ కుటుంబంలో.. మీకు దగ్గరి వారికి ఇలా జరిగితే అప్పుడు కూడా చట్టపరమైన అభిప్రాయాన్ని ప్రస్తావిస్తారా అంటూ ప్రశ్నించాడు. దీనిపై కస్తూరి రీ ట్వీట్ చేస్తూ లైంగిక వేధింపులు తాను కూడా ఎదుర్కొన్నట్లు చెప్పింది. అయితే ఎవరు తనను వేధించారనేది మాత్రం స్పష్టం చేయలేదు. కస్తూరి తెలుగులో ‘నిప్వురవ్వ’.. ‘అన్నమయ్య’ సినిమాల్లో నటించి మెప్పింది. ప్రస్తుతం గృహలక్ష్మీ అనే సీరియల్ లో నటిస్తోంది.