కరోనా వ్యాధి విస్తరణతో లాక్‌డౌన్ ప్రకటించిన వేళ రాష్ట్రానికి మొత్తం తాళం పడింది. అందులో భాగంగా బస్సులు మొత్తం డిపోల్లోనే నిలిచాయి. అయితే అన్‌లాక్ 1.0 నుంనే ఆర్టీసీ బస్సులకు అనుమతినిచ్చినా సిటి బస్సులకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇటీవల దేశంలోని కొన్ని మెట్రో పాలిటన్ సిటీల్లో సిటి బస్సులు ప్రారంభమయ్యాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బస్సులను నడిపించారు. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో సిటిబస్సులను నడిపించారు ఆర్టీసీ అధికారులు కోవిడ్ నిబంధనలతో రాజేంద్రనగర్, మహేశ్వరం బండ్లగూడ, ఇబ్రహీంపట్నం డిపోలల నుంచి సర్వీసులు ప్రారంభమయయ్యా. దీంతో నగరవాసుల్లో కాస్త ఉపశమనం కలిగింది.