
రాజస్థాన్‌రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ల జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా మారింది. ధోనీ టీం సీఎస్కే గట్టిగా ప్రయత్నించినా ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో ధోనిపై గౌతమ్ గంభీర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చెన్నై లక్ష్యం 217 కాగా ధోని 4 లేదా 5 స్థానంలో బ్యాటింగ్‌కు దిగాకి గాని ఏడో స్థానంలో రావడానికి కారణమేంటని ప్రశ్నించాడు. కెప్టెన్ ముందుండి నడిపించే బాధ్యత ధోనికి లేదని అని నిలదీశాడు. 200 పరుగుల లక్ష్యాన్ని ఏడోస్థానంలో వచ్చిన ధోని ఏ విధంగా చేధిస్తాడని అన్నారు. ఇది పూర్తిగా మతిలేని చర్య అని వ్యాఖ్యానించారు. చివర్లో వచ్చి ధోని స్కోరు చేసినా అవి వ్యక్తిగతంగానే వస్తాయి కాని మ్యాచ్‌ను గెలిపించవని అన్నారు.