Actor Suman On Aadipurush: ఆదిపురుష్ మూవీపై అన్నీ వివాదాలే. టీజర్ విడుదలతో మొదలైన విమర్శల పరంపర కొనసాగుతోంది. ఆదిపురుష్ విడుదల అనంతరం మరిన్ని అభ్యంతరాలు తెరపైకి వచ్చాయి. తాజాగా హీరో సుమన్ సైతం అసహనం వ్యక్తం చేశారు. సుమన్ మాట్లాడుతూ… రాముడు అంటే మనకు నీలి రంగులో మాత్రమే తెలుసు. ఈ మూవీలో మీసాలు, గడ్డాలతో సాదా సీదాగా చూపించారు. అది పెద్ద రిస్క్. ఇక రావణాసురుడు పాత్రను మరింత మోడ్రన్ గా చూపించారు. అలా చేయడం తప్పు డైరెక్టర్ చేసిన ప్రయోగాలు ఇబ్బంది పెట్టాయి.
కొన్ని సీన్స్ లో గ్రాఫిక్స్ బాగున్నాయి. మరికొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ పాతగా ఉన్నాయి. సీతా అపహరణ నుండి రావణుడు సంహారం వరకు మాత్రమే చూపించారు, అని సుమన్ చెప్పుకొచ్చారు. అయితే రాముడు పాత్రలో ప్రభాస్ అద్భుతమని సుమన్ అన్నారు. రెండేళ్ల పాటు ఆ బాడీ మైంటైన్ చేయడం అంత సులభం కాదని చెప్పుకొచ్చాడు. సుమన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
జూన్ 16న ఆదిపురుష్ వరల్డ్ వైడ్ విడుదల చేశారు. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతుంది. ఇప్పటి వరకు నాలుగు వందలకు పైగా వసూళ్లు సాధించింది. నిర్మాతలు ఆదిపురుష్ చిత్ర వసూళ్ల పట్ల సంతృప్తికరంగా ఉన్నారు. ఆదిపురుష్ పై వచ్చే ట్రోల్స్ ని మేకర్స్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఆదిపురుష్ డిస్ట్రిబ్యూటర్ వివేక్ కూచిబొట్ల ట్రోలర్స్ పై ఫైర్ అయ్యారు.
ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాఘవుడు పాత్ర చేశారు. ఇక జానకికగా కృతి సనన్ నటించారు. కీలకమైన లంకేశ్వరుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ అలరించారు. దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆదిపురుష్ చిత్రాన్ని టి సిరీస్ బ్యానర్లో భూషణ్ కుమార్ నిర్మించారు. అజయ్, అతుల్ సంగీతం అందించారు. ఆదిపురుష్ ని మోడ్రన్ రామాయణంగా ఈ మేకర్స్ అభివర్ణించడం విశేషం…