Kamal Haasan Indian 2: ఒకప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి ఇండియన్. శంకర్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో ఒక ప్రభంజనం. ఇప్పటికీ ఈ సినిమాని టీవీ లో టెలికాస్ట్ చేసినప్పుడు చూస్తుంటే ఎంత అద్భుతంగా తీశారు రా బాబు అని అనుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా ఇండియన్ 2 అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ శంకర్.
భారీ లెవెల్ ప్లానింగ్ తో ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యినప్పటి నుండి ఎదో ఒక సమస్య వస్తూనే ఉంది. మొత్తానికి కోవిద్ తర్వాత ఆ సమస్యలన్నీ పరిష్కరించుకొని రెడ్ గైన్ట్ ఫిలిమ్స్ సంస్థ జోక్యం చేసుకోవడం వల్ల ఇప్పుడు నాన్ స్టాప్ గా రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటూ చివరి దశకి చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విమానాశ్రయం లో జరుగుతుంది.
కమల్ హాసన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయం లో విమానాశ్రయం కి చెందిన సిబ్బంది వచ్చి షూటింగ్ ని ఆపివెయ్యాలంటూ ఆదేశించారు. ఎందుకంటే మూవీ టీం విమానాశ్రయం పరిసర ప్రాంతాలలో కేవలం దీపార్చర్ ప్రాంతం లోనే షూటింగ్ చేసుకోవడానికి అనుమతిని ఇచ్చారు. కానీ మూవీ యూనిట్ ఆ ప్రాంతాన్ని దాటి లావటరీ ప్రాంతం లో కూడా షూటింగ్ చేయడాన్ని గమనించి తప్పుబట్టారు. వెంటనే షూటింగ్ ని ఆపేసి ఇక్కడి నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు.
నిర్మాతలు అనుమతి కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఒప్పుకుంటారో లేదో చూడాలి. కమల్ హాసన్ ‘విక్రమ్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న చిత్రం ఇది, ఫ్యాన్స్ లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.