https://oktelugu.com/

Prabhas Adipurush: ప్రభాస్ ఎంత చెప్తున్నా వినకుండా డైరెక్టర్ అలా చెయ్యడం వల్లే ‘ఆదిపురుష్’ అంత పెద్ద ఫ్లాప్ అయ్యింది!

అలాగే రావణాసురిడి వేషధారణ, ఆయన హెయిర్ స్టైల్ , పదితలలు చూపించిన విధానం ఇలా అన్నీ కూడా ఈ చిత్రం పై వ్యతిరేకత చూపించడానికి కారణం అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే బ్రాహ్మణుడు అయిన రావణాసురుడు మాంసాహారం తినడం, తాను పెంచుకుంటున్న జంతువుకి స్వయంగా తినిపియ్యడం వంటివి తీవ్రమైన వ్యతిరేకతని ఏర్పాటు చేసుకునేలా చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : June 21, 2023 / 03:16 PM IST

    Prabhas Adipurush

    Follow us on

    Prabhas Adipurush: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఒక పక్క మేకర్స్ కి కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ గా మిగిలితే, మరోపక్క హిందూ ధర్మ సంఘాల నుండి తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రామాయణం ని వెక్కిరిస్తూ చేసిన ఈ చిత్రాన్ని వెంటనే బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వినతి పత్రాలు పంపించారు. కొన్ని ప్రాంతాలలో ప్రదర్శనలు నిలిపివేశారు, మన పురాణాల్లో కానీ, పాత చిత్రాల్లో కానీ ఎక్కడా కూడా శ్రీ రాముడికి మీసాలు లేవు, కానీ ఇందులో రాముడికి మీసాలు ఉంటాయి.

    అలాగే రావణాసురిడి వేషధారణ, ఆయన హెయిర్ స్టైల్ , పదితలలు చూపించిన విధానం ఇలా అన్నీ కూడా ఈ చిత్రం పై వ్యతిరేకత చూపించడానికి కారణం అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే బ్రాహ్మణుడు అయిన రావణాసురుడు మాంసాహారం తినడం, తాను పెంచుకుంటున్న జంతువుకి స్వయంగా తినిపియ్యడం వంటివి తీవ్రమైన వ్యతిరేకతని ఏర్పాటు చేసుకునేలా చేసింది.

    మళ్ళీ వీటిని మేకర్స్ సమర్ధించుకోవడం విశేషం, మేము రామాయణం ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తీసాము కానీ, రామాయణం తియ్యలేదు అని మీడియా కి చెప్పుకొచ్చారు. ఇకపోతే ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ విధానం ని చూసి ప్రభాస్ కి షూటింగ్ ప్రారంభమైన నాలుగు రోజులకే అనుమానం వచ్చిందట.

    ‘నేను ఈ సినిమా చెయ్యొచ్చు కదా ..?, దేనినైనా మన ఇష్టం గా చూపించొచ్చు కానీ, శ్రీ రాముడి చరిత్ర విషయం లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని అన్నాడట. అప్పుడు ఓం రౌత్ మీరేం టెన్షన్ టెన్షన్ పడకండి, మొత్తం నేను చూసుకుంటాను, అని అన్నాడట. ప్రభాస్ అతనిని గుడ్డిగా నమ్మి, నేడు ఆయన కూడా విమర్శలపాలయ్యే చేసుకున్నాడు. తమ అభిమాని హీరో నీపై నమ్మకం ఉంచితే ఇలాంటి ప్రోడక్ట్ తీస్తావా అంటూ ఫ్యాన్స్ ఓం రౌత్ పై మండిపడుతున్నారు.