https://oktelugu.com/

Rajendra Prasad: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్..చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

తల మీద క్యాప్ పెట్టుకొని ఎక్కువగా ఆయన బయట కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈసారి ఆయన తల మీద ఉండే క్యాప్ ని తొలగించి మొట్టమొదటిసారి దర్శనమిచ్చాడు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఆయన మీడియా కి కనిపించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 17, 2024 / 04:22 PM IST

    Rajendra Prasad

    Follow us on

    Rajendra Prasad: సీనియర్ హీరోలలో లెజెండ్స్ గా పిలవబడే దిగ్గజాలతో ఒకరు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. రెగ్యులర్ హీరోలు లాగ కాకుండా కామెడీ హీరో అనే ట్రెండ్ ని తీసుకొచ్చి, టాలీవుడ్ కి ఎన్నో ఆల్ టైం క్లాసిక్ చిత్రాలను అందించిన చరిత్ర ఆయనది. ఆరోజుల్లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో సరిసమానంగా ఆడేవి. ఆయన సినిమాలతో ఈయన సినిమాలు పోటీ పడేవి. కేవలం కామెడీ హీరోల పాత్రలు మాత్రమే కాకుండా, అప్పుడప్పుడు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా రాజేంద్ర ప్రసాద్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేవాడు. అందుకే ఆయనకీ నాలుగు నంది అవార్డులు, మూడు సైమా అవార్డులు వచ్చాయి.

    అయితే రాజేంద్ర ప్రసాద్ ని ఇంకా భారత దేశ ప్రభుత్వం సరైన పురస్కారంతో గుర్తించలేదు. ఈపాటికి ఆయనకీ పద్మశ్రీ లేదా పద్మభూషణ్ అవార్డు వచ్చి ఉండాలి. ఇకపోతే హీరో గా కెరీర్ అయిపోయిన తర్వాత కూడా రాజేంద్ర ప్రసాద్ క్యారక్టర్ ఆర్టిస్టుగా ఏ రేంజ్ లో రాణించాడో మన అందరికీ తెలిసిందే. క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత ఆయనకీ ఎన్నో అద్భుతమైన పాత్రలు దక్కాయి. గత ఏడాది కూడా ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో అద్భుతమైన పాత్ర పోషించి మంచి మార్కులు కొట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది ఆయన వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన ప్రభాస్ ‘కల్కి’ చిత్రం లో ముఖ్య పాత్ర పోషించాడు. ఒకప్పటి లాగ రాజేంద్ర ప్రసాద్ ఈమధ్య రెగ్యులర్ గా సినిమాలు చెయ్యడం లేదు. కేవలం మనసుకి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ ముందుకు పోతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో చెప్పుకోదగిన చిత్రం నితిన్ హీరో గా నటిస్తున్న ‘రాబిన్ హుడ్’. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇది కాసేపు పక్కన పెడితే రాజేంద్ర ప్రసాద్ బయట చాలా సాధారణంగా ఉంటాడు అనే విషయం అందరికీ తెలిసిందే. పెద్ద సెలబ్రిటీ అనే గర్వం ఆయనలో ఎక్కడా కనిపించదు.

    తల మీద క్యాప్ పెట్టుకొని ఎక్కువగా ఆయన బయట కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈసారి ఆయన తల మీద ఉండే క్యాప్ ని తొలగించి మొట్టమొదటిసారి దర్శనమిచ్చాడు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఆయన మీడియా కి కనిపించాడు. ముసలివాడిలా, అసలు గుర్తుపట్టలేని విధంగా రాజేంద్ర ప్రసాద్ తయారు అవ్వడంని చూసి అక్కడికి వచ్చిన భక్తులు ఆశ్చర్యపోయారు. నలుగురిలో ఒకరిగా ఆయన అందరితో పాటే క్యూ లైన్ లో నిల్చొని శ్రీవారి దర్శనం చేసుకున్నాడు. ఒక్కరు కూడా ఆయనని గుర్తించలేకపోవడం విశేషం. ఆయన తిరుమలలో దర్శనం చేసుకొస్తున్న వీడియో ని క్రింద అందిస్తున్నాము చూడండి. ఇకపోతే త్వరలోనే రాజేంద్ర ప్రసాద్ ఒక బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది, రీసెంట్ గానే ఆయన ఒక పెద్ద సంస్థలో సినిమా చేసేందుకు సంతకం చేసాడట.