https://oktelugu.com/

Shah Rukh Khan: షూట్ టైమ్ లో షారుఖ్ ఖాన్ ఎన్ని గంటలు పడుకుంటాడంటే..?

ఒక సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ అలాంటి ఎన్నో సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న నటుడు షారుఖ్ ఖాన్...

Written By:
  • Gopi
  • , Updated On : August 17, 2024 / 04:16 PM IST

    Shah Rukh Khan(1)

    Follow us on

    Shah Rukh Khan: బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు షారుఖ్ ఖాన్…అమితాబచ్చన్ తర్వాత ఇండస్ట్రీలో బాలీవుడ్ బాద్షాగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు కూడా ఈయనే కావడం విశేషం. ఇక అప్పట్లో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ను సంపాదించుకోవడమే కాకుండా ఆయనను కింగ్ ఖాన్ గా కూడా నిలబెట్టాయి… ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పటికీ షారుఖ్ ఖాన్ మాత్రం పఠాన్, జవాన్ లాంటి రెండు సినిమాలతో 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక రాజ్ కుమార్ హీరాని డైరెక్షన్ లో వచ్చిన ‘డంకి ‘ సినిమా నిరాశపర్చినప్పటికీ ఆయన ఎక్కడ కూడా తగ్గకుండా మంచి జోష్ తో ముందుకు సాగుతున్నాడు…ఇక ఇదిలా ఉంటే ఇప్పటి కూడా షారుక్ ఖాన్ తనదైన రీతిలో సినిమాలు చేస్తు ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయనతో పాటు వర్క్ చేయడానికి ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కూడా పోటీ పడుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న షారుక్ ఖాన్ కొన్ని అసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అమెరికన్ యాక్టర్ అయిన ‘మార్క్ వాల్ బర్గ్’ నిద్ర లేచి సమయానికి నేను పడుకుంటాను అని చెప్పాడు.

    నిజానికి షారుఖ్ ఖాన్ పొద్దున్నే 5 గంటలకి పడుకొని 10 గంటలకు నిద్రలేస్తారట. షూటింగ్ ఉన్న సమయం లో ఆయన షూట్ నుంచి అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి స్నానం చేసి వర్కౌట్స్ చేసి పడుకుంటారట. ఇక షూట్ టైమ్ లో ఆయన కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే పడుకుంటాడట…అలాగే షూట్ ఉన్న రోజు ఒక్క పూట మాత్రమే తను భోజనం చేస్తానని చెప్పారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా వైరల్ గా మారింది…

    ఇక మొత్తానికైతే షారుఖ్ ఖాన్ లాంటి యాక్టర్ ఇండియా లోనే టాప్ హీరోగా ఎదిగాడు. ఇక ఆయన ఎంటైర్ కెరియర్ లో ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్ లతో నటించి మెప్పించాడు. ఇప్పుడు సౌత్ సినిమా దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జవాన్ సినిమాని తమిళ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో చేసి సక్సెస్ అందుకున్నాడు.

    ఇక మొత్తానికైతే తనను తాను స్టార్ హీరోగా నిలుపుకోవడానికి ఇప్పటికీ కూడా చాలా తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయనకు 59 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ ఫిజికల్ గా కూడా ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉండటమే కాకుండా ఇప్పటి యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ ముందుకు సాగుతుండటం విశేషం…ఇక మీదట కూడా ఆయన చాలా మంచి సక్సెస్ లను అందుకోవడానికి రెడీ అవుతున్నాడు…