https://oktelugu.com/

Mirapakay: ‘మిరపకాయ్’ చిత్రంలో హరీష్ శంకర్ భార్య ఉందా..? ఆమె ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు!

భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయిల షేర్ లోపే వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. సినిమా ఇంత పెద్ద ఫ్లాప్ అయ్యింది అని తెలిసినప్పటికీ కూడా హరీష్ శంకర్ తన మూవీ టీం తో కలిసి మొదటిరోజే సక్సెస్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 17, 2024 / 04:27 PM IST

    Mirapakay

    Follow us on

    Mirapakay: ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా హరీష్ శంకర్ మాత్రమే కనిపిస్తున్నాడు. కారణం రీసెంట్ గా ఆయన రవితేజ తో చేసిన ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రం విడుదల అవ్వడమే. ప్రొమోషన్స్ లో ఆయన ఏ స్థాయిలో మాట్లాడాడో మనమంతా చూసాము. కొంతమంది విలేఖరుల మీద కూడా ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. అలా మిస్టర్ బచ్చన్ పై వివిధ కారణాలతో అంచనాలను అమాంతం పెంచేలా చేసిన హరీష్ శంకర్, విడుదల తర్వాత ఆయన ఏ స్థాయి ట్రోల్ల్స్ ఎదురుకుంటున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒక సినిమాని ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా, పరమ చెత్తగా ఎలా తియ్యాలో మిస్టర్ బచ్చన్ ని చూస్తే అర్థం అవుతుంది, కొత్తగా ఇండస్ట్రీ లోకి వచ్చే డైరెక్టర్స్ ఈ సినిమాని చూసి ఎలా తియ్యకూడదో చూసి నేర్చుకోవాలి అంటూ నెటిజెన్స్ హరీష్ శంకర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

    భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయిల షేర్ లోపే వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. సినిమా ఇంత పెద్ద ఫ్లాప్ అయ్యింది అని తెలిసినప్పటికీ కూడా హరీష్ శంకర్ తన మూవీ టీం తో కలిసి మొదటిరోజే సక్సెస్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇదంతా పక్కన పెడితే గతం లో హరీష్ శంకర్ రవితేజ తో ‘మిరపకాయ్’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని చేసాడు. ఈ సినిమాలో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ కి స్నేహితురాలిగా స్నిగ్ద అనే అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయి డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఆమె చెప్పిన ప్రతీ డైలాగ్ లోనూ కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. ఈమె మరెవరో కాదు హరీష్ శంకర్ భార్య అని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.

    ఇదే విషయాన్ని మొన్న జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్ లో హరీష్ శంకర్ ని విలేఖరులు అడగగా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘ఆ అమ్మాయి నా భార్య కాదు. నా భార్య పేరు కూడా స్నిగ్ద అవ్వడం వల్ల అందరూ ఆ అమ్మాయిని నా భార్య అని అనుకున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా విదేశాల్లో ఉంటుంది. రీసెంట్ గానే ఫోన్ చేసి నా సినిమాలో నటిస్తావా అని అడిగితే నటించలేను అని చెప్పింది’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ అమ్మాయితో మిమ్మల్ని లింక్ చేసి సోషల్ మీడియా లో ఇన్ని కథనాలు వచ్చాయి కదా, మీ భార్య మిమ్మల్ని ఏమి అనలేదా? అని హరీష్ శంకర్ ని విలేఖరి అడగగా, ఆయన మా భార్య ఇలాంటివి అసలు పట్టించుకోదని, ఎప్పుడైనా నా మీద రూమర్స్ వస్తే వాటిని చూసి ఆమె నవ్వుతుంది అంటూ బదులిచ్చాడు.