ఈ సందర్భంగా ఒక వీడియోనను రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఏమి చెప్పాడంటే.. ‘ఈ కరోనా కారణంగా గత కొద్ది రోజులుగా డ్యాన్సర్లకు ఎలాంటి పని లేకుండా పోయింది. చివరకు షో, ఆడియో ఫంక్షన్లు, సంగీత్ వంటి కార్యక్రమాలు కూడా ఆగిపోవడంతో, గ్రూప్ డ్యాన్సర్లలో చాలామందికి ఇన్ కమ్ లేదు. దాంతో వాళ్ళు చాల ఇబ్బందులు పడుతున్నారు. పూట గడవక చాలామంది బాధపడుతున్నారు.
అందుకే, అలాంటి ఇబ్బందులు పడుతున్న ఏ డ్యాన్సర్ అయినా సరే, వీడియో కింద నేను ఇస్తోన్న కింది నంబర్ లకు ఫోన్ చేసి, నిత్యావసర వస్తువులు కలెక్ట్ చేసుకోండి. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నవారికే మాత్రమే సరుకులు ఇస్తున్నాము. బయట ఊర్లల్లో ఉన్న వారికీ సరుకులు ఇవ్వడం సాధ్యమవ్వడం లేదు. ఇక బయట పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి కాబట్టి, దయచేసి ఎవరూ బయటకు తిరగొద్దు’ అంటూ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.
ఏది ఏమైనా శేఖర్ మాస్టర్ చేస్తోన్న ఈ సాయం ఎంతో విలువైనది. సినిమా వాళ్లల్లో చాలామందికి పూట కూడా గడవని పరిస్థితులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కళను నమ్ముకుని వచ్చి, కడుపు కూడా నింపుకోలేకపోవడం అంటే, కచ్చితంగా కళకే అవమానం. ఇంత దారుణమైన దుస్థితి కళాకారులకు రావడం నిజంగా సిగ్గుచేటే.