
దేశ రాజదాని దిల్లీలో కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. రేపటితో ముగియనున్న లాక్ డౌన్ ను మరోవారం పాటు పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ వర్చువల్ గా జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. దిల్లీలో మునుపటితో పోలిస్తే పాజిటివిటీ రేటు తగ్గినప్పటికి ఇంకా ఆందోళనకరంగాను కొనసాగుతోందని వైద్యనిపుణులు తెలిపారు.