Sekhar Kammula: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు సెన్సిబుల్ డైరెక్టర్లుగా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసే సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ చాలా కూల్ గా ఉంటాయి. ఇక అలాంటి వాళ్లలో శేఖర్ కమ్ముల (Shekar Kammula) ఒకరు… ఆయన చేసిన ప్రతి సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. సున్నితమైన భావోద్వేగాలతో ఒక చిన్న కథను తీసుకొని రెండు గంటల పాటు దానిని స్క్రీన్ మీద అద్భుతంగా చెప్పగలిగే కెపాసిటి ఉన్న దర్శకులలో తను మొదటి స్థానంలో ఉంటాడు. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ ను హీరోగా పెట్టి ‘కుబేర’ (Kubera) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తన ఎంటైర్ కెరియర్ లో ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా, లవ్ స్టోరీ లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఈ సినిమాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు ప్రేక్షకులు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. యాక్షన్ సన్నివేశాలు ఏమీ లేకుండా చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్ తోనే చాలా అద్భుతంగా చూపిస్తూ ప్రేక్షకుడిని మంత్రముగ్ధుల్ని చేయడంలో ఆయనను మించిన వారు మరెవరు లేరు.
Also Read: జైలర్ 2 లో బాలయ్య తో నటించడం పట్ల క్లారిటీ ఇచ్చిన శివరాజ్ కుమార్…
ఇక ప్రస్తుతం కుబేర సినిమాతో కూడా ఒక బీద వాడికి ఒక ధనికుడికి మధ్య ఉన్న భేదాలు ఏంటి అనేది ఎత్తి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నుంచి వస్తున్న సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుంది తద్వారా ఆయనకంటూ ఎలాంటి గుర్తింపు రాబోతుంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో సైతం తన మార్కును చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే కుబేర (Kubera) సినిమాని రిలీజ్ చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన తన ఎంటైర్ కెరీర్ లో ఒక్క స్టార్ హీరో తో కూడా పని చేయలేదు.
కానీ ఇకమీదట వచ్చే సినిమాలతో మాత్రం స్టార్ హీరోలను టార్గెట్ చేసి భారీ కలెక్షన్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతానని కొన్ని ఇంటర్వ్యూలో చెబుతుండడం విశేషం… మరి తన తదుపరి సినిమా ఎవరితో చేస్తాడు స్టార్ హీరోతో చేస్తాడా లేదంటే మీడియం రేంజ్ హీరోతోనే సరిపెట్టుకుంటాడా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read: రాజమౌళి తో గొడవ పెట్టుకొని మరి తను అనుకున్నది సాధించుకున్న వేణు మాధవ్…