Venu Madhav: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్లకి కు చాలా మంచి గుర్తింపైతే ఉంది. ముఖ్యంగా వేణు మాధవ్ (Venu Madhav) లాంటి నటుడు ఒకానొక సందర్భంలో వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా ఎదిగే ప్రయత్నం చేశాడు. ఇక ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినప్పటికి ఆయన కామెడీ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే కమెడియన్ గా ఆయన ఎంతటి గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు… రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో నితిన్ (Nithin) హీరోగా వచ్చిన సై (Sye) సినిమాలో ఆయన చేసిన కామెడీ అంతా ఇంత కాదు…ముందుగా ఈ సినిమాలో అతని కామెడీ చాలా సాఫ్ట్ గా ఉండడంతో వేణుమాధవ్ ఆ విషయాన్ని రాజమౌళికి చెప్పారట. మొదట రాజమౌళి పర్లేదు అన్నప్పటికీ వేణుమాధవ్ వినకుండా ఇంకా ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పాడట…దాంతో రాజమౌళి కొంచెం ఆలోచించి నువ్వైతే ఈ క్యారెక్టర్ ని ఎలా చేస్తావు అని అతనిని అడగడట…దాంతో వేణుమాధవ్ కామెడీ సీన్లను కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఆడ్ చేస్తూ ఒక సీన్ అయితే చేసి చూపించారట. దాంతో అది చాలా కామెడీగా ఉండడంతో రాజమౌళి దానికి ఇంప్రెస్ అయ్యి రైటర్స్ చేత అతని క్యారెక్టర్ ని మరికొంత ఎక్కువ డ్యూరేషన్ ఉండే విధంగా రెండు సీన్లలో పూర్తవ్వకుండా ఆరు సీన్ల వరకు పెంచి అతని క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేశాడట. ఇక ఈ సినిమాలో నీ పేరు ‘నల్ల బాలు’ అని రాజమౌళి చెప్పడంతో ‘నల్ల బాలు నాకీ చంపుతా’ అంటూ వేణుమాధవ్ యాడ్ చేశారట.
Also Read: నాని ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరం అవుతున్నాడా..?
దాంతో రాజమౌళి బాగా ఇంప్రెస్ అయ్యి అదే డైలాగ్ ని సినిమాలో పెట్టించాడు. ఇక సినిమా మొత్తం ఒకెత్తయితే వేణుమాధవ్ కామెడీ మరొక ఎత్తుగా మిగిలిపోయిందనే చెప్పాలి. ఇక సై సినిమా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి వేణుమాధవ్ కామెడీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఐతే వేణుమాధవ్ ఇచ్చే ఇన్పుట్స్ చాలా అద్భుతంగా ఉంటాయని గమనించిన రాజమౌళి ప్రతి సినిమాలో కూడా అతనికి ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వడమే కాకుండా తన నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకొని మరి అతని సినిమాలో యాడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా కొంతకాలం క్రితమే వేణు మాధవ్ అనారోగ్యంతో చనిపోవడంతో సినిమా ఇండస్ట్రీకి ఆయన లేని లోటునైతే ఎవరు తీర్చలేక పోతున్నారు.
ఇక ఎలాంటి కామెడీ సీన్ అయినా సరే అలవోక నటించి ప్రేక్షకుడిని నవ్వించే కెపాసిటీ ఉన్న వేణుమాధవ్ అతి తక్కువ సమయంలోనే సినిమా ఇండస్ట్రీని ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి. మరి రాజమౌళి లాంటి దర్శకుడు సైతం ఆయన చేసిన ప్రతి సినిమాలో వేణు మాధవ్ కోసం ఒక క్యారెక్టర్ ని డిజైన్ చేయించి మరి అతన్ని తన సినిమాలో తీసుకునేవాడు అంటే మామూలు విషయం కాదు…
Also Read: జైలర్ 2 లో బాలయ్య తో నటించడం పట్ల క్లారిటీ ఇచ్చిన శివరాజ్ కుమార్…