Sekhar Kammula: రీసెంట్ గానే ‘కుబేర'(Kuberaa Movie) చిత్రంతో శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు లో ఇప్పటికీ ఈ చిత్రం కొత్త సినిమాలను సైతం డామినేట్ చేస్తూ అద్భుతమైన లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభకు సెల్యూట్ చేశారు. రెండు భిన్నమైన ప్రపంచాలను, సహజత్వానికి దగ్గరగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని మిస్ అవ్వనివ్వకుండా శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తీర్చి దిద్దిన తీరు అమోఘం. రీసెంట్ గానే వంద కోట్ల మార్కు ని అందుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతటి భారీ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల ఏ చిత్రం చేయబోతున్నాడు అని మీ అందరికి సహజం గానే అనిపించొచ్చు.
Also Read: సుజీత్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన తదుపరి చిత్రం గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘ఒక విప్లవాత్మక చిత్రాన్ని తీసిన తర్వాత నాకు లవ్ స్టోరీ లు చేయడం అలవాటు. నా తదుపరి చిత్రం కూడా లవ్ స్టోరీ జానర్ లోనే ఉంటుంది. అందరూ నేను ఎక్కువ సమయం ఒక సినిమాని తియ్యడానికి తీసుకుంటారని అంటూ ఉంటారు. కానీ సమయం తీసుకున్నా మంచి సినిమాతోనే వస్తాను అనేది నా నమ్మకం. నా తదుపరి చిత్రం లవ్ స్టోరీ జానర్ లో ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ఎవ్వరూ ముట్టుకొని కోణం లోనే ఆ సినిమాని తీస్తాను. కానీ కాస్త సమయం పడుతుంది. ఈసారి నేను KM రాధాకృష్ణన్ తో కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయి. గతం లో మేమిద్దరం కలిసి ‘ఆనంద్’, ‘గోదావరి’ వంటి చిత్రాలను తీసాము’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఎందుకంటే ఈ చిత్రం మోడరన్ టైం కి సంబంధించినది అని,నా అభిరుచి కి తగ్గట్టుగా లవ్ స్టోరీ మ్యూజిక్ ఉండాలంటే రాధాకృష్ణన్ తోనే సాధ్యం అవుతుందని చెప్పుకొచ్చాడు. అయితే ఈ చిత్రం లో హీరోగా ఎవరు నటించబోతున్నారు ?, చాలా కాలం నుండి శేఖర్ కమ్ముల నేచురల్ స్టార్ నాని తో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడు. ఈ చిత్రం లో నాని నే హీరో గా నటించబోతున్నాడా?, కానీ నాని ఇమేజ్ ఇప్పుడు మారింది కదా?,పెద్ద సినిమాలు చేస్తున్నాడు, మరి లవ్ స్టోరీ ని ఆయన ఒప్పుకుంటాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.