Nani , Srikanth Odela
Nani and Srikanth Odela : తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు నాని(Nani)…ఆయన చేసిన వరుస సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపైతే ఉంది. మరి ఆయన చేస్తున్న సినిమాలు భారీ విజయాలుగా నిలవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్న ఆయన తన తదుపరి సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం… మరి ఆయన చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నాయి. తద్వారా ఆ సినిమాలు ఎలాంటి గుర్తింపును తీసుకొస్తాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆయన చేసిన ‘దసర’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక వీళ్ళ కాంబినేషన్ లో మరోసారి ప్యారడైజ్ (Paradaise) అనే సినిమా వస్తుంది. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం షేక్ చేసింది. ఇక దసర (Dasara) సినిమా షూటింగ్ సమయంలో నాని మొదటి షాట్ తీసేటప్పుడు శ్రీకాంత్ ఓదెల, నానితో మూడు నుంచి నాలుగు టేకుల వరకు షూట్ చేయించారట.
ఒక్క టేక్ కూడా ఓకే కాకపోవడంతో ఆయన ఇగో హర్ట్ అయిందని అయినప్పటికి తను చాలెంజింగ్ గా తీసుకొని ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్ ని బిల్డ్ చేసుకొని మరి మెప్పించారట. మొత్తానికైతే శ్రీకాంత్ ఓదెల నానితో మొదటి షాట్ కే నాలుగు టేకులు చేయించి మరి ఓకే చేసుకున్నాడు.
ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజంగా డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటున్న శ్రీకాంత్ ఓదెల తన తదుపరి సినిమాతో భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెపుస్తోంది. మరి ఏది ఏమైనా వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది.
మరి ఆ బాండింగ్ కి గుర్తుగా రెండో సినిమాని కూడా భారీ విజయంగా నిలిపినట్లైతే మాత్రం నాని పాన్ ఇండియాలో స్టార్ హీరోగా మారిపోవడమే కాకుండా తనకంటూ ఒక స్టార్ స్టేటస్ ను కూడా అందుకున్న వాడవుతాడు. మరి ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ కానున్న నేపధ్యంలో అప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తూ ప్రేక్షకుల్లో మంచి హైప్ ని క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : 100% స్ట్రైక్ రేట్ విషయంలో పవన్ ని దాటేసిన నేచురల్ స్టార్ నాని!