https://oktelugu.com/

Sekhar Kammula: శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్ కి ఎందుకంత ప్రాధాన్యత ఉంటుందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నప్పటికీ శేఖర్ కమ్ముల లాంటి దర్శకులకు మాత్రం సపరేట్ ఐడెంటిటీ ఉంటుందనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాల్లో ప్రతి పాత్ర కి చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది... ఇక ఆయన చేసే సినిమాలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండడమే కాకుండా ఆ సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో 100% సక్సెస్ లను సాధిస్తూ ఉంటాయి...

Written By:
  • Gopi
  • , Updated On : December 2, 2024 / 06:04 PM IST
    Follow us on

    Sekhar Kammula: తెలుగు సినిమా ఇండస్ట్రీలో శేఖర్ కమ్ములకు దర్శకుడి గా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఆయన మాస్ సినిమాలకు చాలా దూరంగా ఉంటాడు. అందువల్లే ఆయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంటుందనే చెప్పాలి. ఇక ఇప్పటికి కూడా శేఖర్ కమ్ముల నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో ఆ సినిమా పట్ల విపరీతమైన అటెన్షన్ అయితే ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన ఎంచుకున్న పాయింట్ కూడా యూనిక్ పాయింట్స్ గా ఉండటమే కాకుండా చిన్న చిన్న ఎమోషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడిస్తూ ఉంటాడు. నిజానికి ఆయన మొదటి సినిమా నుంచి కూడా హీరోయిన్ల పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తు ఉంటాడు. ముఖ్యంగా ఆనంద్, గోదావరి, ఫిదా లాంటి సినిమాల్లో హీరోయిన్ మీదే సినిమా మొత్తం నడుస్తూ ఉంటుంది. తద్వారా ఆయన సినిమాలకి ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు రావడమే కాకుండా ఆయనకంటూ ఉన్న టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో వర్క్ అవుట్ అయిందనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఆయన లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన లాంటి దర్శకుడు ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఇలాంటి సాఫ్ట్ సినిమాలతో కూడా సూపర్ సక్సెస్ లను అందుకోవచ్చని నిరూపించిన ఏకైక దర్శకుడు కూడా ఈయనే కావడం విశేషం…

    ఇక ఆయన బాటలోనే కొంతమంది దర్శకులు నడుస్తూ మంచి సినిమాలు చేయడానికి తీవ్రమైన ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా తన దైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు ధనుష్ ను హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాడు.

    ఈ సినిమాలో నాగార్జున కూడా కీలకపాత్రలో నటిస్తుండడం విశేషం… మరి మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా? లేదా అనే విషయం తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈయన సినిమాల్లో హీరోయిన్స్ కి సపరేట్ క్యారెక్టరైజేషన్ ని క్రియేట్ చేయడం పట్ల ఆయన చాలా ఆసక్తిగా ఉంటారట. ఎందుకంటే ఆయన చేసే ప్రతి పాత్రని కూడా డిఫరెంట్ వే లో ప్రజెంట్ చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు.

    ఇక హీరోలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా హీరోయిన్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సినిమాకి ఉన్న ఇంపాక్ట్ అనేది ఎక్కువగా పెరుగుతుందని తను భావిస్తూ ఉంటాడు. అందువల్లే ఆయన సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలకి చాలా మంచి గుర్తింపైతే వస్తు ఉంటుంది…