Sekhar Kammula: మిత్రమా’ అనే పిలుపే చెవుల్లో మోగుతోంది అని భావోద్వేగానికి గురైన డైరెక్టర్ శేఖర్ కమ్ముల.

Sekhar Kammula: సిరివెన్నెల సినిమాతో సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా అంటూ జనాన్ని నిగ్గదీసి అడిగి.. తన పదసంపద ఒంపుల్లో ప్రేమ, బాధ, కరుణ, రౌద్రం.. ఇలా నవరసాలను పండంచిన వ్యక్తి సిరివెన్నెల. ఏదైనా పాట రాయాలంటే..పెన్ను సిరాలోంచి అక్షరాలు తూటాల్లా దూసుకెళ్లి వస్తుంటాయి. ప్రతి మనసును కదిలించి.. నిద్ర లేకుండా చేస్తాయి. అంతటి శక్తి ఆయన రచనా సాహిత్యానికి ఉంది. ఇప్పటికీ ఎన్నో నిద్రలేన రాత్రుల్లో.. చీకటి పొరల్ని చీల్చుకుని వచ్చే […]

Written By: Sekhar Katiki, Updated On : December 2, 2021 8:03 pm
Follow us on

Sekhar Kammula: సిరివెన్నెల సినిమాతో సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా అంటూ జనాన్ని నిగ్గదీసి అడిగి.. తన పదసంపద ఒంపుల్లో ప్రేమ, బాధ, కరుణ, రౌద్రం.. ఇలా నవరసాలను పండంచిన వ్యక్తి సిరివెన్నెల. ఏదైనా పాట రాయాలంటే..పెన్ను సిరాలోంచి అక్షరాలు తూటాల్లా దూసుకెళ్లి వస్తుంటాయి. ప్రతి మనసును కదిలించి.. నిద్ర లేకుండా చేస్తాయి. అంతటి శక్తి ఆయన రచనా సాహిత్యానికి ఉంది. ఇప్పటికీ ఎన్నో నిద్రలేన రాత్రుల్లో.. చీకటి పొరల్ని చీల్చుకుని వచ్చే వెలుగులా తన అక్షరాల్ని జనాలపై సంధించారు సిరివెన్నెల. చివరకు ఆ కలం కదలిక లేకుండా ఆగిపోయింది. గగనం శిఖరాల్లో కలిసిపోయింది.

ఎంతోమంది దర్శకులకు తన అద్భుతమైన సాహిత్యం తో కొన్ని వందల చిత్రాలకు పదసంపద రూపంలో తరతరాలు వినీల అద్భుతమైన పాటలను అందించారు సిరివెన్నెల. ఆయనను గుర్తు చేసుకుంటూ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ ని పోస్ట్ చేశారు.

నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్న ఎందుకు వినదో నా మది ఇపుడైనా.. మీరిక రారు అన్న నిజాన్ని అంగీకరించడానికి ఇప్పటి నా మానసిక స్థితిని చెప్పటానికి కూడా మీ పాటే ఊతమవుతోంది. మాటల్లో చెప్పలేని ఎన్నో భావోద్వేగాలు, అనుభూతిని చెప్పడానికి మీ పాటల్ని తలుచుకుంటాం. దర్శకుడు-గేయ రచయితగా మనది “అనామిక ,ఫిదా” అనే రెండు సినిమాల బంధం. మీ పాటకి నాకూ మూడు దశాబ్దాల అనుబంధం. మనసుకి కష్టంగా ఉంది సీతారామశాస్త్రి గారు, ‘మిత్రమా’ అనే పిలుపే చెవుల్లో మోగుతోంది అని భావోద్వేగంతో పోస్ట్ చేశారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల.