https://oktelugu.com/

Salman Khan: చిరంజీవి అడిగారని ఓకే చెప్పా అంటున్న సల్మాన్ ఖాన్

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన హిందీ నటుడైన తెలుగు ప్రేక్షకులకు అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ప్రేమాలయం, ప్రేమ పావురాలు వంటి చిత్రాలకు ఎంత ఆదరణ దక్కిందో వేరుగా చెప్పనక్కరలేదు. అప్పటి కాలం నుండి సల్మాన్ అంటే తెలుగు ప్రేక్షకులకు నచ్చిన మెచ్చిన హీరో గా చెప్పవచ్చు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రం లో ప్రత్యేకమైన పాత్రలో సల్మాన్ నటిస్తున్న విషయం తెలిసిందే.మహేశ్‌ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 2, 2021 / 08:06 PM IST
    Follow us on

    Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన హిందీ నటుడైన తెలుగు ప్రేక్షకులకు అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ప్రేమాలయం, ప్రేమ పావురాలు వంటి చిత్రాలకు ఎంత ఆదరణ దక్కిందో వేరుగా చెప్పనక్కరలేదు. అప్పటి కాలం నుండి సల్మాన్ అంటే తెలుగు ప్రేక్షకులకు నచ్చిన మెచ్చిన హీరో గా చెప్పవచ్చు.

    ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రం లో ప్రత్యేకమైన పాత్రలో సల్మాన్ నటిస్తున్న విషయం తెలిసిందే.మహేశ్‌ వి. మంజ్రేకర్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్, ఆయుష్‌ శర్మ హీరోలుగా నటించిన హిందీ చిత్రం ‘అంతిమ్‌’. సల్మాన్‌ ఖాన్‌ నిర్మించిన ఈ సినిమా నవంబరు 26న విడుదలై ప్రేక్షక ఆదరణ పొందింది.

     

    అయితే ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో థ్యాంక్స్‌ మీట్‌ ఏర్పాటు చేయగా సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ… నా సినిమా విడుదలకు ముందే ఇండియాలోని ప్రధాన నగరాలకు వెళ్లి ప్రమోషన్స్‌ చేయడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తుంటాను. అయితే ఈసారి టైగర్‌ 3’ షూటింగ్‌ వల్ల టైమ్‌ కుదరలేదు.

    “అంతిమ్‌ ” కి చిత్రానికి మంచి స్పందన వస్తోంది ప్రత్యేకించి హైదరాబాద్‌లో ఆదరిస్తున్న నా ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెప్పేందుకే వచ్చాను. కోవిడ్‌ వల్ల ‘అంతిమ్‌’కు టైమ్‌ లేక తెలుగులో డబ్‌ చేయలేదు.ఇప్పటివరకు వరకు నా చిత్రాలు తెలుగులో డబ్ చేసినవే అయితే నేను నేరుగా తెలుగులో నటిస్తున్నాను. ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రంలో చేయమని చిరంజీవిగారు అడిగారు. పాత్ర ఏంటి? ఎన్ని రోజులు షూటింగ్‌ అని అడగకుండా సరే అన్నాను. వెంకటేశ్‌గారితో కూడా నటించబోతున్నాను’’నా తదుపరి చిత్రాన్ని హిందీ, తెలుగులో విడుదల చేస్తాను అని సల్మాన్‌ ఖాన్‌ అన్నారు.