Sekhar Kammula Emotional Comments: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న దర్శకులలో ఒకరు శేఖర్ కమ్ముల(Sekhar Kammula). ఈయన మార్క్ ఎమోషన్స్ అంటే ఇష్టపడని తెలుగు ప్రేక్షకుడు ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. మిగిలిన దర్శకులతో పోలిస్తే శేఖర్ కమ్ముల చేసిన సినిమాలు చాలా తక్కువే, సినిమా సినిమాకి మధ్య ఆయన తీసుకునే గ్యాప్ కూడా చాలా ఎక్కువ. కానీ ప్రేక్షకులు జీవితాంతం గుర్తించుకోదగ్గ సినిమాలను మాత్రమే ఇప్పటి వరకు ఆయన చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన ‘కుబేర’ చిత్రం ఈ నెల 20 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా నిన్న గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూస్ ఇవ్వడం చాలా తక్కువ.
ఇప్పుడు ఆయన కొత్త సినిమా విడుదల అవుతుంది కదా, ఒక్క ఇంటర్వ్యూ అయినా ఇచ్చి ఉంటాడేమో అని నెటిజెన్స్ యూట్యూబ్ లో వెతికి చూస్తే, గతంలో ఆయన ఒక ప్రముఖ టాప్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ మాత్రమే కనిపిస్తుంది. ఆ ఇంటర్వ్యూ లోని కొన్ని హైలైట్ పాయింట్స్ ని సోషల్ మీడియా లో నెటిజెన్స్ షేర్ చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ‘గోదావరి’ మూవీ విశేషాల గురించి చెప్పుకొచ్చాడు. యాంకర్ ఆయన్ని ఒక ప్రశ్న అడుగుతూ ఎప్పుడూ కొత్త వాళ్ళతో సినిమాలు చేసేందుకే ఇష్టపడుతూ ఉంటారు. పెద్ద హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యమే లేదా అని అడిగినప్పుడు, ఎందుకు లేదు, కచ్చితంగా ఉంది అంటూ సమాధానం ఇచ్చాడు శేఖర్ కమ్ముల. ‘అప్పట్లో ‘గోదావరి’ చిత్రాన్ని ముందుగా మహేష్ బాబు(Super Star Mahesh Babu) కి వినిపించాను, ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత గోపీచంద్ కి వినిపించాను , ఆయన కూడా అంగీకరించలేదు. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గారి వద్దకు ఈ స్టోరీ ని తీసుకొని వెళ్లాలని ప్రయత్నం చేశాను’
‘ఆయన మనుషులు ఈ కథ ని ఆయన వద్దకు తీసుకెళ్లారో లేదో తెలియదు కానీ, ఆయన కూడా ఈ సినిమా చేయలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ కమ్ముల. అప్పుడు యాంకర్ మాట్లాడుతూ ‘ఆనంద్ లాంటి సూపర్ హిట్ సినిమాని తీసిన తర్వాత కూడా వాళ్ళు నిన్ను డైరెక్టర్ గా గుర్తించలేదా?’ అని అడిగితే , దానికి శేఖర్ కమ్ముల సమాధానం చెప్తూ ‘అయ్యుండొచ్చు(నవ్వుతూ)..ఈ కథ వాళ్ళ మాస్ ఇమేజ్ అడ్డు వస్తుందని రిజెక్ట్ చేసి ఉండొచ్చేమో’ అని చెప్పుకొచ్చాడు. హీరోల ఇమేజ్ ని పక్కన పెట్టి ఇలాంటి సున్నితమైన సినిమాలు చేస్తే అవి కమర్షియల్ గా సక్సెస్ అవుతాయి అంటారా అని యాంకర్ అడిగితే, దానికి శేఖర్ కమ్ముల సమాధానం చెప్తూ ‘ఎందుకు అవ్వవు..ఇలాంటి లాజిక్స్ నేను నమ్మను. కథని ప్రారంభం నుండి చివరి వరకు ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా థియేటర్లో కూర్చోబెట్టగలిగితే కచ్చితంగా సక్సెస్ అవుతాయి’ అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ కమ్ముల.