Shekhar Kammula : ‘లవ్ స్టోరీ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల(Shekar Kammula) తెరకెక్కిస్తున్న చిత్రం ‘కుబేర'(Kubera Movie). అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), తమిళ హీరో ధనుష్(Dhanush) ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రష్మిక(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుంది. చాలా కాలం నుండి షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి అభిమానుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ కమ్ముల మార్క్ సినిమా రాబోతుందని అందరూ ఆ టీజర్ ని చూసిన తర్వాత అనుకున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభం నుండి ఎన్నో అడ్డంకులను ఎగురుకుంటూ ముందుకెళ్తుంది. ‘కుబేర’ అనే టైటిల్ ని ప్రకటించినప్పుడే వివాదం మొదలైంది. సురేందర్ అనే వ్యక్తి ఈ టైటిల్ తమదని, తమ అనుమతి లేకుండా మూవీ యూనిట్ టైటిల్ ని దోచేసింది ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసాడు.
కానీ మూవీ టీం నుండి ఈ ఫిర్యాదు పై ఎలాంటి స్పందన రాలేదు. తమ పని తాము చేసుకుంటూ ముందుకు పోతున్నారు. దీంతో సురేందర్ ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకొని, రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు తెలిసేలా రేపు హైదరాబాద్ లోని సోమాజిగూడ లో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయబోతున్నాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల, అదే విధంగా ‘కుబేర’ మూవీ టీం తమకి ఎలాంటి అన్యాయం తలపెట్టిందో పూసగుచ్చినట్టు వివరించడానికి సిద్ధం అవుతున్నాడు. కనీసం అప్పుడైనా మూవీ టీం స్పందించి, అతనికి జరగాల్సిన న్యాయం చేస్తారని సురేందర్ ఆశ కావొచ్చు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో. శేఖర్ కమ్ముల సినిమాలన్నీ ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరయ్యేట్టు ఉంటాయి. మన ఇంటి పక్కన జరిగే కథ లాగానే అనిపిస్తాయి ఆయన సినిమాలు. కుబేర చిత్రం కూడా అలాంటిదే అట.
కానీ ఈసారి ఆయన క్రైమ్ థ్రిల్లర్ జానర్ ని ఎంచుకున్నాడు. ఆయన ఏ జానర్ ని ఎంచుకున్నా ఒక సందేశం మాత్రం జనాలకు అందిస్తూ ఉంటాడు. అది అతని స్టైల్. ఈ చిత్రం ద్వారా కూడా అదే చేయబోతున్నాడు. ఇందులో అక్కినేని నాగార్జున ఒక నిజాయితీ గల ప్రభుత్వ అధికారి గా కనిపించబోతున్నాడు. కానీ ధనుష్ క్యారక్టర్ పై ఇంకా క్లారిటీ రాలేదు. కొన్ని పోస్టర్స్ లో ఆయన బిచ్చగాడిలా కనిపించాడు. టీజర్ లో మాత్రం ఒక షాట్ లో మీసం గెడ్డం గీసుకొని, అమాయకపు కుర్రాడిలా కనిపించాడు. అసలు ధనుష్ క్యారక్టర్ ఏమిటి?, ఎందుకు బిచ్చగాడి గెటప్ లోకి వెళ్ళిపోయాడు వంటి అంశాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి అనేది టీజర్ ని చూస్తేనే తెలుస్తుంది. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యినప్పటికీ, విడుదల తేదీపై క్లారిటీ రాకపోవడం గమనార్హం. ఈ ఏడాది లోనే ఈ చిత్రం విడుదల ఉండొచ్చు.