Thug Life World Wide Closing Collections: నటుడిగా, నిర్మాతగా కమల్ హాసన్(Kamal Haasan) ఈమధ్య కాలం లో పీక్ రేంజ్ ని చూస్తున్నాడు. ‘విక్రమ్’ చిత్రం తో ఆయన టైం మొదలైంది. ఆ సినిమాలో ఆయన హీరోగా నటిస్తూనే, మరోపక్క నిర్మాతగా కూడా వ్యవహరించాడు. కెరీర్ లో ఎప్పుడూ చూడనంత డబ్బుని నిర్మాతగా ఆ సినిమాకి చూశాడు కమల్ హాసన్. ఇక గత ఏడాది ఆయన హీరో గా నటించిన ‘ఇండియన్ 2’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది కానీ, అదే ఏడాది లో ఆయన నిర్మాతగా వ్యవహరిస్తూ తీసిన ‘అమరన్’ చిత్రం మాత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. అతి తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందించి వందల కోట్ల రూపాయిల లాభాలను మూటగట్టుకున్నాడు. అంతటి భారీ హిట్ తర్వాత ఆయన హీరో గా నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తూ చేసిన ‘థగ్ లైఫ్'(Thug Life) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైంది.
మణిరత్నం(Maniratnam) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో మరో క్రేజీ తమిళ స్టార్ శింబు(Silambarasan TR) కూడా కీలక పాత్ర పోషించాడు. విడుదలైన మొదటి రోజు నుండే ఈ చిత్రానికి ఘోరమైన నెగటివ్ టాక్ వచ్చింది. మొదటి రోజు ఓపెనింగ్ మినహా, రెండవ రోజు నుండి కలెక్షన్స్ రికార్డు స్థాయిలో డ్రాప్ అవుతూ వచ్చాయి. అలా డ్రాప్ అవుతూ వచ్చిన ఈ చిత్రం కేవలం పది రోజుల్లోనే థియేట్రికల్ రన్ ని ముగించుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లోకి కొత్త సినిమాలేవీ రాకపోవడం తో ఈ చిత్రాన్ని ప్రదరిస్తున్నారు కానీ, కనీసం థియేటర్స్ కి కరెంటు ఖర్చులు,రెంట్ ఖర్చులు కూడా రాని రేంజ్ లో ఆడుతుంది. దీంతో ట్రేడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఇంతే అని తేల్చి చెప్పేసాయి. వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకు కనీసం వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు.
Also Read: Kamal Hassan-Trisha: స్టేజిపై త్రిష తో కమల్ హాసన్ అసభ్యకరమైన జోక్..ఈ వయస్సులో అవసరమా?
ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు ఎంతో ఒకసారి చూద్దాము. తమిళనాడు ప్రాంతం లో 38 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, తెలుగు రాష్ట్రాల నుండి 4 కోట్ల 10 లక్షలు, కేరళ రాష్ట్రము నుండి మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్ల 50 లక్షలు, ఓవర్సీస్ నుండి 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 89.60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కనీసం ఫుల్ రన్ లో వంద కోట్ల గ్రాస్ ని కూడా రాబట్టలేక డీలా పడిందంటే ఎంత పెద్ద డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.కర్ణాటక లో ఈ సినిమా బ్యాన్ కి గురైన సంగతి తెలిసిందే. ఒకవేళ ఆ ప్రాంతం లో విడుదల అయ్యుంటే కచ్చితంగా వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకునేదాని అంటున్నారు.