ఆ 3తో పాటు ఈ 2 కూడా ఓటీటీల్లోకే !

కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా.. థియేటర్లు కూడా అందుబాటులోకి వచ్చినా.. మరో రెండు నెలల వరకు థియేటర్ల బిజినెస్ ఫామ్ లోకి వచ్చేలా లేదు. అందుకే, కొంత మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలలో విడుదల చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాని ‘టక్ జగదీష్’, నితిన్ ‘మాస్ట్రో’, వెంకటేష్ ‘దృశ్యం 2’ సినిమాలు ఇప్పటికే ఓటీటీల్లో విడుదలకు అంగీకరించాయి. పై మూడు సినిమాలు ఓటీటీ కంపెనీలకు అమ్ముడుపోయాయి కూడా. నితిన్ ‘మాస్ట్రో’ త్వరలోనే […]

Written By: admin, Updated On : August 6, 2021 10:35 am
Follow us on

కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా.. థియేటర్లు కూడా అందుబాటులోకి వచ్చినా.. మరో రెండు నెలల వరకు థియేటర్ల బిజినెస్ ఫామ్ లోకి వచ్చేలా లేదు. అందుకే, కొంత మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలలో విడుదల చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాని ‘టక్ జగదీష్’, నితిన్ ‘మాస్ట్రో’, వెంకటేష్ ‘దృశ్యం 2’ సినిమాలు ఇప్పటికే ఓటీటీల్లో విడుదలకు అంగీకరించాయి.

పై మూడు సినిమాలు ఓటీటీ కంపెనీలకు అమ్ముడుపోయాయి కూడా. నితిన్ ‘మాస్ట్రో’ త్వరలోనే హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతుంది. ఈ సినిమాకి బాగానే గిట్టుబాటు అయింది. నిజానికి ఈ సినిమా పై ఎలాంటి అంచనాలు లేవు. అదే థియేటర్ రిలీజ్ అయి ఉంటే.. మరో చెక్ అయి ఉండేది. అప్పుడు నితిన్ కి ఉన్న ఆ మార్కెట్ కూడా దెబ్బ తినేది. మొత్తానికి ఓటీటీ నితిన్ కి బాగా కలిసొచ్చింది.

అలాగే ‘దృశ్యం 2’ (హాట్ స్టార్), ‘టక్ జగదీష్’ … సెప్టెంబర్ లో స్ట్రీమ్ కానున్నాయి. ఇదే బాటలో గోపీచంద్ నటించిన ‘సీటిమార్’, శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’, శర్వానంద్ నటిస్తున్న ‘మహా సముద్రం’ కూడా ఓటీటీ రిలీజ్ కోసం ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ‘సీటిమార్’, ‘మహా సముద్రం’ ఓటీటీ కంపెనీలతో చర్చలు కూడా మొదలుపెట్టాయి.

కానీ, ‘మహా సముద్రం’కు ఆశించిన స్థాయిలో ఆఫర్ రావడం లేదు. ‘సీటిమార్’కి 38 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారట. మరి త్వరలోనే ‘సీటిమార్’ రిలీజ్ విషయంలో కూడా క్లారిటీ రానుంది. మొత్తానికి ఈ ఓటీటీ పరంపర ఇప్పట్లో ఆగేలా లేదు. ఇక చిన్న, మధ్యస్థ చిత్రాలన్నీ ఆల్ రెడీ ఓటీటీ బాట పట్టేశాయి కాబట్టి, థియేటర్ల వ్యాపారానికి ఇప్పట్లో అనుకూలంగా లేనట్లే.

అయితే, ఈ ఓటీటీల విడుదల వ్యవహారం పై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ వర్కర్లు సీరియస్ అవుతున్నారు. అయినా ఇంకా కరోనా పరిస్థితులు సద్దుమణగక పోతే.. ఏమి చేయాలి. ఇప్పుడు అంటే ఓటీటీ రూపంలో నిర్మాతలకు ఓ అవకాశం వచ్చింది. నష్టపోకుండా బయట పడటానికి మంచి అవకాశం దొరికింది అందుకే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను పట్టించుకునే పరిస్థితిలో లేరు.