Sirivennela Seetharamasastri: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో మృతి చెందడంతో ఒక్కసారిగా తెలుగు సినిమా పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ నెల 24న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
ఇకపోతే సిరివెన్నెల మృతి చెందిన తర్వాత ఆయనతో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ పలువురు ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. సీతారామశాస్త్రి చివరిసారిగా ఫోన్ లో దర్శకుడు కూచిపూడి వెంకట్ తో మాట్లాడిన మాటలు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి.ఈ క్రమంలోనే అతనితో సిరి సీతారామశాస్త్రి మాట్లాడుతూ సర్జరీకి ముందు తను మణికొండలో తన కూతురు ఇంటిలో ఉన్నారు. ఆ సమయంలో వెంకట్ ఫోన్ చేయడంతో అతనితో సీతారామశాస్త్రి మాట్లాడిన ఆఖరి మాటలు ప్రస్తుతం అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.
Also Read: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సిరివెన్నెలకు నివాళులు అర్పించిన మంత్రి పేర్ని నాని
ఇలా ఆ దర్శకుడితో మాట్లాడుతూ సోమవారం నా ఊపిరి తిత్తులకు సర్జరీ జరిగింది ఆ తరువాత డిసెంబర్ నెల మొత్తం విశ్రాంతి తీసుకుంటానని చెప్పారట.ఆ సమయంలో వెంకట్ ఏం జరిగింది సార్ అని అడగడంతో నీకు తెలియదా నాకు 2015లో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. అప్పుడు ఎడమవైపు ఊపిరితిత్తులను తీసేశారు. ఇప్పుడు కుడివైపు ఇచ్చేస్తున్నాను కదా అని రెండు తీసుకుంటున్నాడు అని సరదాగా మాట్లాడినట్లు తెలిపారు. ఇక నీ వాసు సినిమాకు పాటలు రాయాలి కదా ఈ రెండు నెలలు రాయలేను ఆ తర్వాత రాస్తాను.రాయకపోతే చూడు జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ రెండు పాటలు రాస్తానని చాలా సరదాగా అతనితో మాట్లాడారని తెలియడంతో ప్రస్తుతం ఈ మాటలను గుర్తు చేసుకొని పలువురు కంటతడి పెట్టుకున్నారు.