https://oktelugu.com/

Sirivennela: ఆయన లేని బాధను వ్యక్తపరచడానికి మాటలు కూడా చాలట్లేదు- ఎన్టీఆర్​

Sirivennela: సిరివెన్నెల మృతితో సినీలోకం మూగబోయింది. ఈ క్రమంలోనే ఆయనను చివరిచూపు చూసుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు తరలివస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినినమా స్టార్స్​ సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాని పార్థించారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, రానా , నాగార్జున, వెంకటేశ్​ తదితరులు సిరివెన్నెల భౌతికగాయాన్ని సందర్శించారు. తాజాగా, ఎన్టీఆర్​ కడసారి సిరివెన్నెలను చూసేందుకు వచ్చారు. మరికొద్దిసేపట్లో ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 1, 2021 / 11:48 AM IST
    Follow us on

    Sirivennela: సిరివెన్నెల మృతితో సినీలోకం మూగబోయింది. ఈ క్రమంలోనే ఆయనను చివరిచూపు చూసుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు తరలివస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినినమా స్టార్స్​ సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాని పార్థించారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, రానా , నాగార్జున, వెంకటేశ్​ తదితరులు సిరివెన్నెల భౌతికగాయాన్ని సందర్శించారు.

    తాజాగా, ఎన్టీఆర్​ కడసారి సిరివెన్నెలను చూసేందుకు వచ్చారు. మరికొద్దిసేపట్లో ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే సిరివెన్నెల నిర్జీవంగా ఉండటాన్ని చూసి.. బరువెక్కిన హృదయంతో తారక్​ మాట్లాడారు.

    కొన్ని సార్లు మన ఆవేదనను, బాధను వ్యక్తపరచాలంటే మాటలు కూడా చాలవని అన్నారు. అలాంటి భావాలను సిరివెన్నెల తన కలంతో వ్యక్తపరిచారని అన్నారు. బహుశా ఈ ఆవేదనను ఆయన తన కలంతోనే వ్యక్తపరిస్తే బాగుండేందని ఎమోషనల్​ అయ్యారు. సీతారామశాస్త్రి గారి కలం ఆగినా.. ఆయన రాసిన ఎన్నో అద్భుతమైన పాటలు, అక్షరాలు, తెలుగు జాతి, తెలుగు భాష బతికున్నంత కాలం అలా చిరస్మరణీయంగా నిలిచిపోతుంది అన్నారు. రాబోయే తరాలకు ఆ సాహిత్యం బంగారు బాటలు వేయాలని కోరారు. పైనుంచి ఆయన చల్లని చూపు ఎల్లప్పుడూ అదరిపై ఉండాలని భవగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తారక్​ తెలిపారు.