Avika ghor: చిన్నారి పెళ్లి కూతురు జీవితాన్ని నాశనం చేసింది ఎవరు?

Avika ghor: నటి అవికా గోర్ అంటే చాలామంది గుర్తుపట్టక పోవచ్చుకానీ, చిన్నారి పెళ్ళికూతురు అంటే అందరికీ టక్కున ఈ హీరోయిన్ గుర్తుకొస్తారు. బాలీవుడ్ బుల్లితెరపై ప్రసారమైన బాలిక వధూ సీరియల్ తెలుగు లో చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ గా అనువదించారు. ఇందులో చిన్నప్పటి ఆనంది పాత్రలో అవికాగోర్ ఎంతో అద్భుతంగా నటించి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. ఈమె నిజానికి బాలీవుడ్ నటి అయినప్పటికీ అచ్చు తెలుగు అమ్మాయిలా ఎంతో మంది తెలుగు ప్రేక్షకాభిమానులను సంపాదించుకుంది. […]

Written By: Navya, Updated On : November 6, 2021 8:38 am
Follow us on

Avika ghor: నటి అవికా గోర్ అంటే చాలామంది గుర్తుపట్టక పోవచ్చుకానీ, చిన్నారి పెళ్ళికూతురు అంటే అందరికీ టక్కున ఈ హీరోయిన్ గుర్తుకొస్తారు. బాలీవుడ్ బుల్లితెరపై ప్రసారమైన బాలిక వధూ సీరియల్ తెలుగు లో చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ గా అనువదించారు. ఇందులో చిన్నప్పటి ఆనంది పాత్రలో అవికాగోర్ ఎంతో అద్భుతంగా నటించి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. ఈమె నిజానికి బాలీవుడ్ నటి అయినప్పటికీ అచ్చు తెలుగు అమ్మాయిలా ఎంతో మంది తెలుగు ప్రేక్షకాభిమానులను సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి: ఆ అందాల హీరో నాశనానికి కారణం.. ఎస్వీయార్ స్నేహమే

ఈ క్రమంలోనే ఈమెకు తెలుగులో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని అన్నపూర్ణ బ్యానర్ లో రాజ్ తరుణ్ హీరోగా నాగార్జున నిర్మాణంలో “ఉయ్యాల జంపాల” అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేశారు. అందరూ ఊహించిన విధంగానే అవికా గోర్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే మొదటి సినిమానే విజయవంతం కావడంతో ఈమెకు వరుస అవకాశాలు వస్తాయని భావించారు.ఇలా తెలుగులో రెండు మూడు సినిమాలలో నటించిన తర్వాత ఈమెకు సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి.

సాధారణంగా కెరియర్ మంచి పొజిషన్లో ఉందనుకున్నప్పుడు ఎవరో ఒకరి వల్ల వారి కెరీర్ నాశనం అవుతూ ఉంటుంది.అలా అవికాగోర్ కెరీర్ నాశనం అవ్వడానికి కూడా తన కుటుంబ సభ్యులు కారణమని ఒకానొక సందర్భంలో ఈమె బయటపెట్టారు. తమ కుటుంబ సభ్యులు డబ్బుల కోసం తనని ఎన్నో చిత్రహింసలు పెట్టారని,ఈ క్రమంలోనే ఈమె ఎంతో మానసిక ఒత్తిడికి లోనై తీవ్ర అనారోగ్యం పాలైనట్లు సమాచారం. ఇందుకోసం ఈమె ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారని ఈ ఆలోచనల కారణంగా తాను సినిమాలపై దృష్టి పెట్టలేకపోయారని లేకపోతే ఈమె ఇప్పటికే హీరోల సరసన అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా ఉండేది అంటూ పలువురు వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ అవికా విషయంలో తన కుటుంబ సభ్యులు ఇలా చేయడం ఎంతో బాధాకరం.

ఇవి కూడా చదవండి: ఆర్‌ఆర్‌ఆర్ నుంచి మరో బిగ్ అప్డేట్… ఈసారి డాన్స్ తో రఫ్ఫాడించనున్న ఎన్టీఆర్, చరణ్