Lenin Censor Review: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ‘ఏజెంట్’ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత , అఖిల్ ఎంతో ప్యాషన్ తో , ఇష్టపడి చేసిన సినిమా ఇది. అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఈ చిత్రం పై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే , ఇక అక్కినేని అఖిల్ కెరీర్ డేంజర్ లో పడినట్టే. అందుకే ఈ చిత్రానికి నాగార్జున స్పెషల్ కేర్ తీసుకున్నారు. ముఖ్యంగా ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని ఆయన చాలా కసరత్తులు చేశారు. సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చిందని , కచ్చితంగా కమర్షియల్ గా బాగా వర్కౌట్ అవుతుందని నాగార్జున బలంగా నమ్ముతున్నారు. ఆయన లో ఈ రేంజ్ నమ్మకం ఉందంటే కచ్చితంగా ఈ సినిమా అదిరిపోయి ఉంటుందని అందరూ నమ్ముతున్నారు.
ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కాసేపటి క్రితమే పూర్తి అయ్యాయి. రేపు విడుదల పెట్టుకొని , ఈరోజు వరకు సెన్సార్ చేయకపోవడం ఏంటి? అని మీకు అనుమానాలు రావొచ్చు. చివరి నిమిషం వరకు నాగార్జున ఫైనల్ కట్ లో కావాల్సిన మార్పులు చేయించడం వల్లే , ఇంత ఆలస్యం అయ్యినట్టు తెలుస్తోంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి UA సర్టిఫికేట్ జారీ చేశారు. వాళ్ళ నుండి వస్తున్న టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమాకు సెకండ్ హాఫ్ ఒక గుండెకాయ లాంటిది అట. ఈమధ్య కాలంలో ఈ రేంజ్ సాలిడ్ ఎమోషన్స్ ఉన్న సెకండ్ హాఫ్ రాలేదని , కచ్చితంగా అఖిల్ కెరీర్ లో ఈ చిత్రం ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి ఆ రేంజ్ లో సినిమా ఉందో లేదో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.
ఈ సినిమాలో నటీనటుల నటనకు ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని , అఖిల్ లో ఈ రేంజ్ యాక్టింగ్ టాలెంట్ ని ఊహించలేదని , హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే కూడా అదరగొట్టేసిందని అంటున్నారు. ఇక ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్ , ట్రైలర్ , పాటలు వంటివి కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచడం లో సక్సెస్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ లోనే ఉన్నాయి. ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ రావడం ఒక్కటే బ్యాలన్స్ , అది వచ్చాక అఖిల్ బాక్స్ ఆఫీస్ వద్ద శివ తాండవం ఆడుతాడని అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్ , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
