Telugu Directors: సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి క్లిక్ అయితే చాలు వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు. దర్శకులు ఈ మధ్యకాలంలో సినిమాలను చేస్తూనే నటులుగా కూడా రాణిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే దర్శకుడి గా చేస్తే వాళ్లకు వచ్చే డబ్బుల కంటే కూడా నటులు గా చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘ పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. చాలా మంచి దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్నప్పటికి ఆయన డైరెక్టర్ గా సినిమాలను చేయడం పక్కనపెట్టి నటుడిగా రాణించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఎందుకని అలా చేస్తున్నాడు మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్నాడు. కదా బెస్ట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఆ కోవలోనే మరిన్ని మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగొచ్చు కదా అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నప్పటికి ఆయనకు మాత్రం నటనంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడంతో ఆయన దానిమీదనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారట…
ప్రస్తుతం ఆయన నటుడిగానే ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తుండటం విశేషం…ఇక ఆయనలానే కేరాఫ్ కంచరపాలెం సినిమాతో మొదటి సక్సెస్ ని సాధించిన వెంకటేష్ మహా సైతం ఆ తర్వాత ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అనే సినిమాని చేశాడు. ఈ సినిమా ఆడకపోవడంతో ఆ తర్వాత నటుడిగా రాణించడానికి ఎక్కువ ఆసక్తి చూపించాడు.
ఈ క్రమంలోనే ‘అంటే సుందరానికి’ అనే సినిమాలో ఒక కీలకపాత్రలో నటించాడు. ఇక ఆ సినిమా తర్వాత మిరాయి సినిమాలో కూడా ఆయన డిఫరెంట్ పాత్రలో నటించడం విశేషం…ఇక కొద్ది రోజుల నుంచి ఆయన ఏ సినిమా ను డైరెక్షన్ చేయకపోవడంతో నటుడిగా చేసినప్పుడు వచ్చిన డబ్బులే అతని సర్వైవల్ కి ఉపయోగపడ్డాయని ఆయన ఒకానొక సందర్భంలో తెలియజేశాడు.
ఇక రీసెంట్ గా ఆయన డైరెక్షన్ లో వచ్చిన ‘రావు బహుదూర్’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా విమర్శకుల నుంచి ప్రశంసలైతే దక్కించుకుంది… గతంలో ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ కూడా డాకూ మహారాజ్ మూవీలో విలన్ గా నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు ఇంకొంతమంది దర్శకులు సైతం నటులుగా రాణించే ప్రయత్నాలైతే చేస్తున్నారు…
