Aryan Khan: షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయి జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలయ్యారు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తన కుమారుడిపై ఎన్నో ఆశలు పెంచుకుని తనను కూడా స్టార్ ను చేయాలని ఆశిస్తున్న షారుక్ ఖాన్ ఆశలపై ఆర్యన్ నీళ్లు చల్లాడు. దీంతో ఆయన తీవ్ర విచారణలో మునిగిపోయారు. ఆర్యన్ ఖాన్ ఇలా దొరకడంపై బాలీవుడ్ లో పలు కథనాలు వినిపిస్తున్నాయి. అసలు ఆర్యన్ దొరకడానికి గల కారణాలేంటి అనేదానిపై ఆరా తీస్తున్నారు.

మరో వైపు ఈ కేసులో పలు కీలక రహస్యాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్యన్(Aryan Khan) ను అదుపు తీసుకునే క్రమంలో ఓ అధికారి డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసు వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఒక దశలో ఆర్యన్ కిడ్నాప్ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఆర్యన్ భద్రతపై షారుక్ ఖాన్ కు భయం పట్టుకుంది.
ఈ క్రమంలో ఆర్యన్ తల్లిదండ్రులు ఆర్యన్ కోసం సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. దీని కోసం సెక్యూరిటీ ఏజెన్సీలను సంప్రదిస్తున్నారు. ఎంత మొత్తమైనా ఖర్చు చేసి బాడీగార్డును ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తాము సేవలందిస్తామని రెడ్ చిల్లీస్ ఆఫీస్ ను సంప్రదిస్తున్నారని సమాచారం.
బాడీగార్డ్ నియామకంపై భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రైవేటు సెక్యూరిటీ నిర్వహణ కోసం ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ సెక్యూరిటీ నిమిత్తం షారుక్ ఖాన్ పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని వెనకాడకపోవచ్చని వారి అభిప్రాయంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆర్యన్ ఖాన్ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరుగుతోంది.
Also Read: పుష్ప ఐటెం సాంగ్లో సమంత!