Homeఎంటర్టైన్మెంట్Pushpa: పుష్ప ఐటెం సాంగ్​లో సమంత!

Pushpa: పుష్ప ఐటెం సాంగ్​లో సమంత!

Pushpa: నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం.. వరుస సినిమాలతో పుల్​ బిజీగా గడుపుతోంది సమంత. ఇప్పటికే పలు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుని షూటింగ్​ కూడా ప్రారంభించింది. అయితే, కేవలం హీరోయిన్​గానే కాకుండా, ఐటమ్​ సాంగ్స్​లోనూ నటించేందుకు సై అంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా, అల్లు అర్జున్​ హీరోగా నటిస్తోన్న పుష్ప సినిమాలో ఓ ఐటెం సాంగ్​కోసం సమంతను మేకర్స్ సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

samantha

ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే.  నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకునేది. నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు క్లియర్​గా కనిపించేది. రాజుగారి గది-2, ఓ బేబీ, మజిలీ వంటి సినిమాల్లో సమంత క్యారెక్టర్ ఎంతో సున్నితంగా, మనసుకు హత్తుకునేలా ఉన్నాయి

అయితే, చైతూతో వివాహానికి ముందు పలు సినిమాల్లో గ్లామర్​గా కినిపించి, ఐటమ్ సాంగ్స్​ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు విడిగా ఉంటున్న నేపథ్యంలో మల్లీ కమర్షిలయల్​ జోన్​లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోననే పుష్పలో ఐటం సాంగ్​కు పచ్చజెండా ఊపడం విశేషం. ప్రస్తుతం చివర భాగం చిత్రీకరణ జరుపుకుంటున్న పుష్ప.. ఈ ఏడాది డిసెంబరు17న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు. రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది.  ఇప్పటికే విడుదలైన పోస్టర్​లు, పాటలు సినిమాపై మంచి హైప్​ క్రియేట్​ చేశాయి. మరి అనుకున్న అంచనాలను చేరుకుంటుదో లేదో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular