18 Pages: వచ్చిన చిన్నచిన్న పాత్రల్లో నటిస్తూ.. మెల్లగా హీరో ఛాన్స్ కొట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నిఖిల్. హ్యాపీడేస్, కార్తికేయ, స్వామిరారా వంటి విభిన్న కంథాంశాలతో ప్రేక్షకులను పలకరించి.. మంచి హిట్లను అందుకున్నాడు. తాజాగా, ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ సినిమాలో హీరోగా కనిపించనున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించనుంది. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు.
తాజాగా, ఓ ఆసక్తికరమైన పోస్టర్‌తో విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18 విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పోస్టర్ కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సుకుమార్ మార్క్ టచ్‌తో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ పోస్టర్ తో సినిమాపై అంచనాలు మరింత పెంచుతున్నారు. ఇక పోస్టర్ ను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమాలో నిఖిల్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది.
నిఖిల్ చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2’ సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా అనుపమా పరమేశ్వరన్‌ను తీసుకున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీ కి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.