https://oktelugu.com/

Lakshya Movie: నాగశౌర్య “లక్ష్య” సినిమా నుంచి “సాయా సాయా” సాంగ్ రిలీజ్…

Lakshya Movie: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య హీరోగా, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య”. ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో సాలిడ్ ఎమోషన్స్ తో తెరకెక్కించిన ఈ చిత్రంలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతోనే సంతోష్​ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కానున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ మూవీని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 4, 2021 / 05:51 PM IST
    Follow us on

    Lakshya Movie: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య హీరోగా, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య”. ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో సాలిడ్ ఎమోషన్స్ తో తెరకెక్కించిన ఈ చిత్రంలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతోనే సంతోష్​ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కానున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ ను స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా చిత్ర బృందం విడుదల చేయించింది. ఇక ఈ ట్రైలర్ లో హీరో నాగ శౌర్య ఎయిట్ ప్యాక్ తో కనిపించడమే కాకుండా డైలాగ్స్ తో అదరగొట్టేశాడు. మళ్ళీ ఇప్పుడు మరో తాజా అప్డేట్ తో అభిమానులను ఖుషీ చేస్తుంది ఈ మూవీ.

    Also Read: RRR Movie: “ఆర్‌ఆర్‌ఆర్” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్… పూనకాలకు రెడీ గా ఉండండి అంటూ

    తాజాగా ఈ చిత్రం నుంచి ‘సాయా సాయా’  అనే సాంగ్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది. కృష్ణ కాంత్ రాసిన ఈ సాంగ్ మంచి లిరిక్స్ తో వినడానికి అలాగే విజువల్స్ పరంగా కూడా ఆకర్షిస్తుంది. అలానే నాగశౌర్య, కేతికల మధ్య కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా కాల భైరవ వ్యవహరిస్తున్నాడు. కాగా ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్రీడా, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించ నున్నారు. డిసెంబరు 5న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్​లో ముఖ్య అతిథులుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, శిక్షకుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్ హాజరు కానున్నారు. యంగ్ హీరో శర్వానంద్ తో పాటు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ వేడుకకు హాజరు కానున్నారు.

    Also Read: పాపం.. ఉప్మా సినిమాకు బిర్యానీ మాటలెందుకో ?

    https://twitter.com/IamNagashaurya/status/1467082710191513602?s=20