మెగాస్టార్ వరుసగా సినిమాలు చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. అందుకే చాలామంది డైరెక్టర్లు మెగాస్టార్ కోసం కథలు రాయడం మానేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మెగాస్టార్ కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మెగాస్టార్ తో ఎప్పటికైనా ఒక సినిమా చేయాలనే ఆశ ఉన్న వాళ్ళంతా ఇప్పటికిప్పుడు కథలు రాయడం కష్టం కాబట్టి.. ఈజీగా రీమేక్ లను తీసుకోవచ్చు అని రీమేక్ సినిమాల మీద పడ్డారు. ఈ క్రమంలోనే మలయాళంలో ‘లూసిఫర్’ అనే సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమా మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
అయితే మొదట ఈ సినిమాకి సుజీత్ దర్సకత్వం అనుకున్నారు. సుజీత్ స్క్రిప్ట్ వర్క్ కూడా చేశాడు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేనట్టు ఉన్నాయి, సుజీత్ ను తప్పించి.. ఆ తరువాత దర్శకుడు వినాయక్ డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుందని క్లారిటీ వచ్చింది. ఇక చిరు కోసం ఈ స్క్రిప్ట్ లో వినాయక్ కొన్ని మార్పులు చేశారని.. ముఖ్యంగా క్యాస్టింగ్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేశారని తెలుస్తోంది. మెయిన్ గా ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర ఒకటి ఉంది. కథా పరంగా ఈ పాత్ర చాల కీలకంగా ఉంటుంది. ఎక్కువగా సినిమాలో హీరో ఏమి చేయడు, ఏం చేయాలన్నా తన అసిస్టెంట్ చేతే చేయిస్తూ.. తన హీరోయిజాన్ని ఆ రకంగా ఎలివేట్ చేసుకుంటూ ఉంటాడు.
Also Read: మరోసారి రెచ్చిపోయిన రోజా-శేఖర్ మాస్టర్..!
అందుకే మొదట ఆ పాత్రలో అల్లు అర్జున్ నటించాలని మెగాస్టార్ ఫిక్స్ అయ్యారు. బన్నీ కూడా మెగాస్టార్ అనుచరుడి పాత్ర చేయడానికి బాగా ఇంట్రస్ట్ చూపించాడు. పైగా ఆ పాత్రకు బన్నీ అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ ఆ పాత్రలో బన్నీ చెయ్యట్లేదు. తక్కువ నిడివి గల ఆ పాత్ర బన్నీ రేంజ్ కి సూట్ అవ్వదని చిరు ఫీల్ అయ్యాడట. అందుకే ఆ పాత్రలో యాక్టర్ సత్యదేవ్ ను తీసుకున్నారు. ఆ అనుచరుడి పాత్రలో సత్యదేవ్ కూడా బాగుంటాడు. ఇక ఈ సినిమాలో హీరోకి చెల్లి పాత్ర అయిన మంజు వార్యర్ పాత్ర కూడా చాల కీలకమైనదే. కాగా తెలుగు వర్షన్ లో ఇప్పుడు ఆ పాత్రలో రోజా నటించబోతుందని సమాచారం.