https://oktelugu.com/

ప్రజలకు బంపర్ ఆఫర్… కేవలం 101 రూపాయలకే స్మార్ట్ ఫోన్..?

భారత్ లో స్మార్ట్ ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. వినియోగం పెరగడంతో కొత్త కొత్త మోడళ్లలో, వినూత్న డిజైన్ లతో స్మార్ట్ ఫోన్లు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. మొన్న దసరా పండుగ సందర్భంగా పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఆఫర్లను ప్రకటించగా ప్రస్తుతం మరికొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు దసరాను మించిన ఆఫర్లతో ముందుకువస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లపై కంపెనీలు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా వివో కంపెనీ కస్టమర్లకు 101 రూపాయలతో కొత్త మొబైల్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 6, 2020 / 07:04 PM IST
    Follow us on

    భారత్ లో స్మార్ట్ ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. వినియోగం పెరగడంతో కొత్త కొత్త మోడళ్లలో, వినూత్న డిజైన్ లతో స్మార్ట్ ఫోన్లు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. మొన్న దసరా పండుగ సందర్భంగా పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఆఫర్లను ప్రకటించగా ప్రస్తుతం మరికొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు దసరాను మించిన ఆఫర్లతో ముందుకువస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లపై కంపెనీలు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి.

    తాజాగా వివో కంపెనీ కస్టమర్లకు 101 రూపాయలతో కొత్త మొబైల్ ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. వివో ఇండియా ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ మేరకు ప్రకటన వెలువడింది. దీపావళి పండుగ సందర్భంగా కొత్త వెలుగులు నింపడానికి కేవలం 101 రూపాయలు చెల్లించి మొబైల్ ఫోన్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని వివో కంపెనీ వెల్లడించింది. కొత్త ఆఫర్లతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వివో ప్రయత్నిస్తోంది.

    వీ 20ఎస్.ఈ, వీ 20, ఎక్స్ 5ఒ సిరీస్, వై 50 స్మార్ట్ ఫోన్లను ప్రజలు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. వివో 101 రూపాయలు చెల్లించి నచ్చిన స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసిన కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తూ ఉండటం గమనార్హం. అయితే ఈ ఆఫర్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఎప్పటివరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందో కంపెనీ ప్రకటించలేదు.

    101 రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి ఫోన్ విలువ మొత్తాన్ని ఈ.ఎం.ఐల వాయిదాలలో సులభంగా చెల్లించవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, ఫెడరల్ బ్యాంక్ కార్డుల ద్వారా ఫోన్ కొనుగోళ్లపై కంపెనీ క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది.