Satya Dev Villain Roles: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. మరి అలాంటి సందర్భంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికి దక్కినటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న నటులు కూడా చాలామంది ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సత్యదేవ్ హీరోగా మాత్రం తనను తాను ఎలివేట్ చేసుకోలేకపోతున్నాడు. కారణం ఏంటి అంటే ఆయన చేసిన సినిమాలు యావరేజ్ గా ఆడుతున్నాయి తప్ప, ఒక భారీ సక్సెస్ అయితే అతనికి పడడం లేదు. దానివల్ల ఆయన ఇటు హీరోగా కొనసాగలేక, అటు విలన్ పాత్రలను చేయలేక మధ్యలో ఊగిసలాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక టాప్ ప్రొడ్యూసర్ తనని విలన్ గా చేయమన్నాడని చెప్పాడు. దానివల్ల స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయి. అలాగే డబ్బులు కూడా బాగా సంపాదించుకోవచ్చు, ఎలాగో నువ్వు హీరోగా చేసిన సినిమాలు ఆడటం లేదు కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పారట. దానికి సత్యదేవ్ చాలా ఫీల్ అయిపోయి డబ్బులు సంపాదించుకోవడానికి నేను ఇండస్ట్రీకి రాలేదు. హీరో అవ్వాలనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీకి వచ్చానని చెప్పాడట…నేను మంచి నటుడిని అని అందరు గుర్తించినప్పుడు నాకు విలన్ పాత్రలు ఇవ్వడం దేనికి నేను హీరోగా కూడా సెట్ అవుతాను కదా అని తనలో తాను అనుకొని ఎలాగైనా సరే మనం అందరికీ సమాధానం చెప్పాలంటే ఒక హీరోగా సాలిడ్ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో ఉన్నానని ఆయన చెప్పడం విశేషం… ఇక రీసెంట్ గా కింగ్డమ్ సినిమాలో విజయ్ దేవరకొండ అన్నగా నటించిన సత్యదేవ్ ఆ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. విజయ్ దేవరకొండ కంటే కూడా ఆయన చేసిన క్యారెక్టర్ చాలా బాగుంది. చాలా మంది ప్రేక్షకులకు కనెక్ట్ అయింది.నటుడిగా మరొక మెట్టు పైకి ఎక్కడనే చెప్పాలి.
Also Read: మహావతార్ నరసింహ.. చెప్పులు విడిచి థియేటర్లోకి.. ఏ సినిమాకు ఇలా కాలేదు…
మరి ఇప్పుడైనా ఆయన మంచి సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ సక్సెస్ లను సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… సత్యదేవ్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరనేది వాస్తవం…
ఎందుకంటే ఆయన చేసిన డిఫరెంట్ పాత్రలను ఎవరు పోషించలేకపోతున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గా చేయడానికి కూడా ఒక రీజన్ అయితే ఉందట. మెగాస్టార్ చిరంజీవి తనతో మాట్లాడి నువ్వు నా సినిమాలు చేయడం వల్ల ఎక్కువమంది ప్రొడ్యూసర్లు నిన్ను చూస్తారు.
Also Read: ‘కూలీ’ లో ఆ ఒక్క సన్నివేశం కోసం రెండేళ్లు కష్టపడ్డారా..?
ఎక్కువ మందికి రీచ్ అవుతావు తద్వారా నీకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పడంతో సత్యదేవ్ ఆ సినిమాలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడట. కానీ ఆ సినిమా తర్వాత అన్ని అలాంటి పాత్రలే రావడంతో ఆయన వాటన్నింటిని రిజెక్ట్ చేస్తూ వస్తున్నట్లుగా చెప్పాడు. మొత్తానికైతే తను హీరోగా రాణించడమే తన లక్ష్యం అంటూ చెప్పడం విశేషం…
“నువ్వు విలన్గా చేస్తే, పెద్ద హీరోలు ఒక మూడు.. నాలుగు సినిమాల్లో పెట్టుకుంటారు…
ఎలానో, నీ సినిమాలు ఆడవుగా అని ఒక ప్రొడ్యూసర్ మొహం మీదే చెప్పాడు. అప్పుడు బాధేసింది.”
Full Interview: https://t.co/xahDIEZlsi pic.twitter.com/49injXVU71
— Gulte (@GulteOfficial) August 6, 2025