Coolie 2 Years Hard Work: సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) నటించిన ‘కూలీ'(Coolie Movie) చిత్రం పై రోజురోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. మేకర్స్ ఆ అంచనాలను తట్టుకోలేక ట్రైలర్ కట్ ని అంచనాలు తగ్గించే విధంగా కట్ చేశారు. అయినప్పటికీ కూడా అంచనాలు తగ్గలేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయం లో ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది అనే చెప్పాలి. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే వెయ్యి షోస్ ద్వారా 1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అక్కడి ఆడియన్స్ కి టికెట్స్ బుక్ చేసుకోవడానికి టికెట్స్ కూడా లేవు. ఆ రేంజ్ ట్రెండ్ కొనసాగుతుంది. పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాక తమిళ సినిమాల్లో నార్త్ అమెరికా లో అత్యధిక ప్రీమియర్ గ్రాస్ ని సొంతం చేసుకున్న చిత్రంగా నిలబడబోతుంది కూలీ. మరోపక్క ఈ సినిమా ప్రొమోషన్స్ విషయం లో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది మూవీ టీం.
Also Read: ఓటీటీ లోకి ‘మహావతార్ నరసింహా’..నిర్మాత సంచలన ప్రకటన!
లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కూడా తమిళం లో వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కూలీ చిత్రం లోని ఒక సన్నివేశం గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘సూపర్ స్టార్ రజనీకాంత్ తో నేను చేయబోయే మొదటి సినిమా కాబట్టి ఇంటర్వెల్ సన్నివేశాన్ని చాలా స్పెషల్ గా రాసుకున్నాను. మొదటి రోజు ఈ సన్నివేశాన్ని చూసిన తర్వాత ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ రియాక్షన్ ఏమిటో తెలుసుకోవడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఆ సన్నివేశాన్ని దాదాపుగా రెండేళ్ల నుండి అలోచించి, చాలా గొప్పగా రాసుకున్నాను. ఈ సినిమాలో శృతి హాసన్(Sruthi Haasan) కూడా చాలా అద్భుతంగా నటించింది. ఆమె నటనని రజనీకాంత్ గారికి చూపించినప్పుడు ఏమి మాట్లాడలేదు కానీ, పక్క రోజు స్వీట్లు ఆర్డర్ చేసి మరీ శృతి కి బహుమతిగా ఇచ్చారు. అదే విధంగా సౌబిన్ సాహిర్ నటనని కూడా రజనీకాంత్ గారు గొప్పగా మెచ్చుకున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు లోకేష్ కనకరాజ్.
Also Read: ‘గేమ్ చేంజర్’ కి నెగిటివ్ రివ్యూ ఇచ్చినందుకు శభాష్ అని మెచ్చుకున్న స్టార్ నిర్మాత!
రెండేళ్ల పాటు శ్రమించి, లోకేష్ కనకరాజ్ లాంటి ప్రతిభ ఉన్న డైరెక్టర్ ‘కూలీ’ చిత్రం లోని ఇంటర్వెల్ సన్నివేశాన్ని రాసాడంటే, ఆ సన్నివేశం ఏ రేంజ్ లో ఉండుంటుందో అని అభిమానులు ఇప్పటి నుండే అంచనాలు వేసుకుంటున్నారు. ఆయన చెప్పినట్టు నిజంగా ఆ సన్నివేశం పేలితే, కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతాయి. తమిళ ప్రేక్షకులు కోరుకునే వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లు ఈ సన్నివేశం తోనే ఖరారు చేసుకోవచ్చు. చూడాలి మరి ఆ సన్నివేశం ఎలా ఉండబోతుంది అనేది. ఇకపోతే ఈ చిత్రం లో అక్కినేని నాగార్జున విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అగ్ర హీరో అయినప్పటికీ కూడా ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకొని చేయడం సాధారణమైన విషయం కాదు. ఆయన కూడా ఈ చిత్రంలో నట విశ్వరూపం చూపించాడని టాక్.