Ravi Teja Mass Jathara Song: రవితేజ హీరోగా, శ్రీలీలా హీరోయిన్ గా వస్తున్న ‘మాస్ జాతర’ సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక మాస్ బీట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘ఓలే ఓలే’ అంటూ సాగే ఈ సాంగ్ లో ఆడియన్స్ కి పిచ్చెక్కించే మాస్ బీట్ ఉన్నప్పటికి అందులోని లిరిక్స్ మాత్రం కొంతవరకు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘ నీ అక్క..నీ అమ్మ’ అంటూ మాటలు వచ్చాయని అవి వినడానికి చాలా బూతు పదాలు గా ఉన్నాయని అలాంటి పాటను ఎలా రాస్తున్నారు. ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ మరి కొంతమంది సైతం ఈ పాటను విమర్శిస్తున్నారు. మరి ఈ సాంగ్ రాసిన ‘భాస్కర్ యాదవ్’ మాత్రం ఒక జానపదం రాస్తున్నప్పుడు అవి అందులో లీనమై ఉంటాయి. వాటిని బూతులు లాగా కాకుండా ఒక సాంగ్ లాగా చూడాలి. అలా ఆ పదాల మీద బూతులనే ముద్ర వేయకూడదు అన్నట్టుగా ఆయన చేశాడు. మరి మొత్తానికైతే ఈ పాటను వింటున్న చాలామంది ఇది ఒక బూతు పాట అంటూ ఒక ముద్ర అయితే వేస్తున్నారు.
Also Read: మహావతార్ నరసింహ.. చెప్పులు విడిచి థియేటర్లోకి.. ఏ సినిమాకు ఇలా కాలేదు…
మరి ఈ సినిమా మీద హైప్ ను పెంచడానికి రిలీజ్ చేసిన ఈ సాంగ్ మీద నెగెటివిటి పెరగడం అనేది సినిమాకి నెగెటివ్ అయిపోయే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. మరి రవితేజ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. రాబోయే సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గత కొన్ని రోజుల నుంచి రవితేజ అసలు సక్సెస్ లను సాధించడం లేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్టుగా ప్లాప్ అవుతున్నాయి. మరి ఇలాంటి క్రమంలో ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది… మరికొద్ది రోజులపాటు ఆయన ఇలాగే సినిమాలు చేసుకుంటూ వెళ్తే మాత్రం ఆయన కెరీర్ అనేది కోల్పోయే అవకాశం అయితే ఉంది…
Also Read: ‘కూలీ’ లో ఆ ఒక్క సన్నివేశం కోసం రెండేళ్లు కష్టపడ్డారా..?
కాబట్టి ఇక మీదట ఆయన చేస్తున్న సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది…లేకపోతే ఆయన మార్కెట్ కోల్పోవడమే కాకుండా ఆయన మార్కెట్ ను మరి కొంతమంది హీరోలు ఆక్రమించుకునే అవకాశమైతే ఉంది…