Tollywood: ‘పలాస 1978’ సినిమాతో ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి. ఆ సినిమాలో తనదైన నటనతో రక్షిత్ ప్రేక్షకులను మెప్పించదనే చెప్పాలి. ఇప్పుడు తాజాగా ఆయన హీరోగా గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న సినిమా ‘శశివదనే’. ఈ సినిమాలో కోమలీ ప్రసాద్ కథానాయికగా చేస్తుంది. అలానే ఈ చిత్రానికి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించనున్నారు. కాగా తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డైరెక్టర్ మారుతి, సంగీత దర్శకులు రఘు కుంచె హాజరయ్యారు.

ఈ మేరకు హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు మారుతి క్లాప్ ఇచ్చారు. సంగీత దర్శకులు రఘు కుంచె కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత శరత్ మరార్ తదితర ప్రముఖులు ఈ ముహూర్త కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో రక్షిత్ మాట్లాడుతూ “తేజగారు చాలా ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్, దర్శకుడు సాయి గారికి అద్భుతమైన విజన్ ఉంది అని అన్నారు. రెహమాన్ గారి శిష్యుడు శరవణ వాసుదేవన్ మంచి మ్యూజిక్ ఇచ్చారని… కోమలీ, గ్యారీ వంటి మంచి టీమ్ దొరికింది అన్నారు.
‘పలాస’ తర్వాత ‘నరకాసుర’ అనే సినిమా చేస్తున్నాను. దాని తర్వాత ఇది మంచి ప్రేమకథ అవుతుంది. ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మమ్మల్ని ఆశీర్వదించాడానికి వచ్చిన మారుతి గారు, రఘు కుంచె గారు, శరత్ మరార్ గారు… అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు” అని రక్షిత్ అన్నాడు.