https://oktelugu.com/

అనుష్కపై జర్నలిస్టు వ్యంగ్యాస్త్రం.. మారుతి స్ట్రాంగ్ కౌంటర్

బాలీవుడ్ నటి అనుష్క.. భారత్ కెప్టెక్ విరాట్ కోహ్లి దంపతులు సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు.. లాక్డౌన్ సమయంలో విరుష్క జోడీ అభిమానులను అలరించారు. కోహ్లి-అనుష్కలు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ తమ అనుభవాలను ఫొటోలు, వీడియోలతో షేర్ చేస్తూ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంటారు. ఎప్పటికప్పుడు అభిమానులతో అమ అనుభవాలను షేర్ చేసుకోవడం ఈ జంట ముందు వరుసలో ఉంటుంది. Also Read: అదిరిపోయే ‘పాట’ పాడుతున్న మహేష్? అనుష్క శర్మ తాను తల్లిని కాబోతున్నందుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 15, 2020 3:39 pm
    Follow us on

    బాలీవుడ్ నటి అనుష్క.. భారత్ కెప్టెక్ విరాట్ కోహ్లి దంపతులు సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు.. లాక్డౌన్ సమయంలో విరుష్క జోడీ అభిమానులను అలరించారు. కోహ్లి-అనుష్కలు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ తమ అనుభవాలను ఫొటోలు, వీడియోలతో షేర్ చేస్తూ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంటారు. ఎప్పటికప్పుడు అభిమానులతో అమ అనుభవాలను షేర్ చేసుకోవడం ఈ జంట ముందు వరుసలో ఉంటుంది.

    Also Read: అదిరిపోయే ‘పాట’ పాడుతున్న మహేష్?

    అనుష్క శర్మ తాను తల్లిని కాబోతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై అభిమానులందరూ కోహ్లి-అనుష్క దంపతులకు బెస్ట్ విషెష్ చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఓ మహిళా జర్నలిస్టు మాత్రం అనుష్క షేర్ చేసిన ఫొటోపై వ్యంగ్యాస్త్రాన్ని సంధించింది. దీనిపై టాలీవుడ్ దర్శకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మహిళా జర్నలిస్టుకు అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చాడు.

    అనుష్క పంపిన ఫొటోపై ఓ మహిళా జర్నలిస్టు స్పందిస్తూ.. ‘అతను మిమ్మల్ని తల్లిని మాత్రమే చేశాడు.. ఇంగ్లండ్‌కు మహారాణిని చేయలేదు.. మరీ, అంత సంబరపడకండి’ అంటూ కామెంట్ చేసింది. దీనిపై దర్శకుడు మారుతి తనదైన శైలిలో స్పందించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    Also Read: నాగబాబూ.. మరీ ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడం అవసరమా?

    ‘ఓ మహిళా జర్నలిస్ట్ అయిన మీరు ఇలాంటి కామెంట్ చేయడం చాలా విచారకరం.. ఇంగ్లండ్‌కు మహారాణి కావడం కంటే ఓ బిడ్డకు తల్లి కావడం ఓ మహిళకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.. ప్రతీ మహిళా ఒక మహారాణే. సంతోషంతో నిండిన ప్రతి ఇల్లూ ఓ గొప్ప సామ్రాజ్యమే.. ఆమె సెలబ్రిటీ కాక ముందు ఓ సాధారణ మహిళ.. తల్లి కాబోతున్న క్షణాలను ఆస్వాదించే హక్కు ఆమెకు ఉందని’ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. నెటిజన్లు కూడా మారుతికే మద్దతు తెలిపారు.