Keerthy Suresh Biography: ‘కీర్తి సురేష్’.. ‘మహానటి’తో తనకంటూ తెలుగు తెర పై ఓ చరిత్రను రాసుకుంది. కీర్తి ఎప్పుడూ తెలుగింటి అమ్మాయిలా నిండుగా కనిపిస్తోంది. మరి ఈ నిండు పున్నమి వెన్నెల గురించి కొన్ని ఆసక్తికర విశేషాలను తెలుసుకుందాం.

‘కీర్తి సురేష్’ వ్యక్తిగత విషయాలు :
మలయాళ నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె కీర్తి సురేష్. కీర్తి అక్టోబర్ 17, 1992 లో జన్మించారు. సినీ కుటుంబంలో పుట్టడం కారణంగా బాలనటిగా తెరంగేట్రం చేశారు. చిన్న తనంలోనే పలు చిత్రాల్లో అద్భుతంగా నటించారు. నాలుగో తరగతి వరకు ఆమె చెన్నైలో చదువుకున్నారు. ఆ తర్వాత ఆమె చదువు తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయంలో సాగింది. తిరిగి చెన్నైకు పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసేందుకు వచ్చారు. అలాగే, స్కాట్లాండ్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారు. లండన్ లో ఫ్యాషన్ డిజైనింగ్ పై ఇంట్రెన్స్ షిప్ కూడా చేశారు. అందుకే, తాను సినిమాల్లోకి నటిగా రాకపోయి ఉంటే, డిజైనింగ్ లో ఉండేదాన్ని అని కీర్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
Also Read: Director Parashuram Biography: డైరెక్టర్ పరశురామ్ గురించి షాకింగ్ విషయాలు
‘కీర్తి సురేష్’ సినీ రంగ ప్రవేశం :

ఇక మలయాళం సినిమాతోనే హీరోయిన్ గా వెండితెరకు పరిచయయ్యారు. 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి సినిమా ఆమెకు హీరోయిన్ గా మొదటి సినిమా. ఆ తర్వాత తమిళ్, తెలుగు చిత్రాల్లో నటించారు. దాంతో, ఆమెకు ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాల్లోనే గుర్తింపు వచ్చింది.
నటిగా ‘కీర్తి సురేష్’ సాధించిన విజయం :
ఇక భారతదేశ చలన చిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా మహానటి సినిమాకి గాను కీర్తి సురేష్ ఉత్తమ తెలుగు కథానాయకిగా అవార్డు అందుకుంది.

‘కీర్తి సురేష్’ క్రమశిక్షణ :
‘కీర్తి సురేష్’ జిమ్ లో డైలీ గంట సేపు గడుపుతుంది. నిపుణుడైన ట్రైనర్ పర్యవేక్షణలో ఆబ్ క్రంచెస్, కార్డియో, వెయిట్స్ మరియు ఫ్రీ హాండ్ వంటి వ్యాయామాలను ‘కీర్తి సురేష్’ క్రమం తప్పకుండా చేస్తోంది. అందుకే ‘కీర్తి సురేష్’ ఈ మధ్య చాలా పర్ఫెక్ట్ ఫిజిక్ తో కనిపిస్తోంది.