https://oktelugu.com/

Pakistan Vs Bangladesh: పాక్ పై విజయంతో బంగ్లా కథ మారిపోయింది.. ఏకంగా మేటి జట్లను దాటేసింది

పాకిస్తాన్ జట్టుపై రెండు టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ జట్టు సంచలనాలను సృష్టించింది. ఈ జట్టు సాధించిన విజయం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో సరికొత్త సమీకరణాలకు కారణమైంది. ఈ పసికూన జట్టు దక్కించుకున్న గెలుపు సరికొత్త చరిత్రకు నాంది పలికింది. బంగ్లాదేశ్ దెబ్బకు మేటి జట్లు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 4, 2024 / 10:04 AM IST

    Pakistan Vs Bangladesh

    Follow us on

    Pakistan Vs Bangladesh: పాకిస్తాన్ జట్టుపై 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ ను బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయం బంగ్లాదేశ్ జట్టుకు అత్యంత అనుకూలంగా మారింది. రావల్పిండి వేదికగా రెండు టెస్ట్ మ్యాచ్ లు జరిగాయి. ఈ సిరీస్ ను బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాదు 45.83 శాతం విజయాలతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పట్టికలో ఏకంగా నాలుగవ స్థానానికి చేరుకుంది. జాబితాలో భారత్ 68.52 శాతం విజయాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ తర్వాత స్థానంలో బంగ్లాదేశ్ ఉంది. ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక జట్లు 5, 6, 7 స్థానాలను ఆక్రమించాయి. పాకిస్తాన్, వెస్టిండీస్ చివరి రెండు స్థానాలలో నిలిచాయి. బంగ్లాదేశ్ తో ఓటమి ద్వారా పాకిస్తాన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నుంచి దాదాపు నిష్క్రమించింది. ప్రస్తుతం ఉన్న విజయాల శాతం ప్రకారం భారత్ – ఆస్ట్రేలియా మరోసారి ఫైనల్ లో తలపడతాయని క్రీడా విశ్వకులు అంచనా వేస్తున్నారు.

    గత ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరిగింది. టోర్నీలో భారత్ – ఆస్ట్రేలియా పోటీపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అంతకు ముందు జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లోనూ ఆస్ట్రేలియా భారత్ చేతిలో ఓటమిపాలైంది. ఐతే ఇటీవల టి20 వరల్డ్ కప్ లో భారత్ ఆస్ట్రేలియా పై విజయం సాధించింది. అయితే ఈసారి ఎలాగైనా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వెళ్లాలని భారత్ భావిస్తోంది. స్వదేశంలో బంగ్లాదేశ్ తో రెండు, ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై ఐదు, న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ భారత్ ఆడనుంది. మూడు మేజర్ సిరీస్ లు ఉన్న నేపథ్యంలో.. అందుకు తగ్గట్టుగానే జట్టును మేనేజ్మెంట్ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆటగాళ్లను పూర్తిస్థాయిలో సన్నద్దం చేసేందుకు దేశవాళీ క్రికెట్ ఆడిస్తోంది.

    ప్రస్తుతం దులీప్ ట్రోఫీ లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా మినహా మిగతా స్టార్ ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు. అనంతపురం వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది. బెంగళూరులోనూ ఒక మ్యాచ్ నిర్వహించనున్నారు. దులీప్ ట్రోఫీ లో ఆడేందుకు భారత స్టార్ క్రికెటర్లు ఇప్పటికే అనంతపురం చేరుకున్నారు. శుక్రవారం నుంచి టోర్నీ ప్రారంభం కానుంది.